ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

రుడు సూరన; ఈతనికుకూరుడు బాలభాస్కరుడు (III); ఈతనికుమారుడు బుచ్చి వేంకటరాయులు (వీరుసజీవులు. చిన్న తనమున కవనము చెప్పి రాజమ హేంద్రమందు విద్వత్సభను మెప్పించి గొప్ప బహుమానము గొన్న వారు) నూరకవి మనుమడగు సూరనను గూర్చి యాతని సమకాలీకులు నడిమింటి రామజోగిశాస్త్రి గారు

 మ. కవిరాజుల్ గల రెందరైన నిఖిలక్ష్మాచక్ర మధ్యం బునన్
దవు గానిమ్ము నిరర్గళ . ప్రక టాపానుగ్రహా ఖండవై ..
భవశుద్ధాంధ్ర వచో ధురంధర ఘన ప్రాబంధికుల్ పేరిలే .
రవురా శ్రీయడిదంబు సూరకవిచంద్రా సాంద్ర తేజోనిధీ .

(యని చెప్పిరి.)

ఈ సూరన కుమారుడగు బాలభాస్కరుడు' (III) -శ్రీమాడుగుల సంస్థానమందు శ్రీ కృష్ణ భూపతి దేవు మహా రాజులుం గారిచే సన్మానింపబడుచు తన తాతనూరకవివ లెనే దేశాటనము చేయుచు కవితావృత్తి చేజీవించుచుండెను. ఈతడు సంగీత సాహిత్యములందు నేర్పరి. విద్వత్సభలయందు సభారంజకముగ నాసుకవిత్వము జెప్పి నవరోజు రాగముతో పద్యములు చదువుచుండెడివాడ ని యాతని మనుమలగు శ్రీపొగరు కృష్ణమూర్తి పంతులుగారు. నాతో సెలవిచ్చిరి. సూరకవియునిట్లే యేదో యొక రాగవరుసనను పద్యములు చదివియుండవలెను.

సూరకవి రచనలలో మూడువంతులాశువులే. ఒకవంతు కావ్యములు,

పూర్వాంధ్ర కవులవలె పదునెనిమిదవ శతాబ్దమున వన్నెకెక్కిసప్రాబంధికుడై సరసముగ కవనము సాగించియు, రామలింగేశ శతక మువంటి రచన లయందా నాటిలోక వ్యవహార విమర్శనమును ధర్మానుసారముగ నెరపి సత్కవి యనదగియు,సుఖజీవనో పాయము లంతగా లేకుండుటచే రాజావలంబనము నపేక్షించియు కూటికై యాత్మ స్వాతంత్య్ర మును కోల్పోకుండియు సమకాలకులను, ఆంధ్రలోకమునకును సంభావ్యుడగునట్టి యీయడిదము సూరకవి జీవితచరితమును సవిమర్శముగఁ జదివి లోతుపాతులరసి యాంధ్రావళి మోదంబొరయు గావుతమని మాసంపాదకీయ విన్నపము. . : . . .. .. ..బుర్రా శేషగిరి రావు. --