ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii


ఉ, ఆలము లన్న వెన్కదిరు - గాడని విక్రమ శక్రనందనుల్ . వేలకు నొక్క బంటు తగు వీరులనన్ .కడిదేరిచేత డ బ్బాలుససీలునున్ గలతు పాకులు బూనినయట్టి భానుపా రాల జవాను లెంతయు ని , రంతరమున్ బహుమంది కొల్వగన్,

ఈ వర్ణనమునకుండదగినటుల నానాటి మంత్రులలో నొకడగు మాబుర్రా బుచ్చన మంత్రి తమ్ముడు వెంకనమంత్రిని ప్రశంసించు నొకశతకమున (ఇది మామిత్రులు పండిత వంగూరి సుబ్బారావు పంతులుగారు కనిపెట్టి నా కొసంగి మాబుర్రావారి కృతజ్ఞతకు పాత్రులైరి) నీ విజయరామ మహారాజులుం గారినిగూర్చి యిట్లు చెప్పబడినది,

క. శతమఖునకు సముఁడు మహో
న్నతపదవిని విజయరామ • సరనాధుఁడు ప
న్మతి జలమున నీవు బృహ
స్పతి సముడవు. బుర్ర వంశ భవ వేంకన్నా.

క.బుధుచిభునిభ శుభవిభవ
ప్రభావ శోభితుడు విజయ • రామధరిత్రీ
విభురత్నము నిన్నేలిన
ప్రభువుకదా బుర్ర వంశ • భవ వేంకన్నా.

క. కుజసనిర్హణ సంతత
సుజనతా ణార్థజనిత • శుభవిలవదధో
క్షజ విజయ రామ నరపతి ..
భజనోత్సుక బుర్ర వంశ • భవ వేంకన్నా.

.

ఈపద్యములు శ్రీ విజయ రామమహా రాజులుం గారినిగూర్చియు, వారిమం త్రులగూర్చియు ప్రశంసించుటయే గాక, సూరకవి విరచితములగు పొణుగుపొటి వేంకట మంత్రిత్రి పద్యములను పోలియుండుటచే నానాటికవులు నూరక విరచనల -ననుక రించి యూతని కవనము నానిధమున 'మెచ్చియుండుటను సూచిం చుచున్నవి.


సూరకవిది కవికుటుంబమనుట సూరకవి కోవహరాతని ,యనంతరము గూడ స్థిర పరచిరి. సూరకవి కుమారుడు బాలభాస్కరడు(11), ఈతనికుమా