ఈ పుట ఆమోదించబడ్డది

అడిదము సూరకవి.

135

దీనినిబట్టి సారమతులగు కవీంద్రులు, అక్షర రమ్యతనాదరింపరని తేలుచున్నది. ఇంతియె గాక తాను "నానారుచిరార్థసూక్తినిధి"యని చెప్పుకొనియెను. కాఁబట్టి ప్రశంసనీయమగు కావ్యమునందుఁ బ్రసన్నమగు కథయు, ప్రసన్నమగు కవితయు, నర్థయుక్తియు నుండవలెనని యామహాకవి యభిప్రాయము. అంతియె గాని యాలంకారిక గ్రంథముల యందుఁజెప్పఁబడిన విశేషగుణముల నన్నింటిని బ్రధానముగఁ జెప్పలేదు. కవి బ్రహ్మయగు తిక్కన తన నిర్వచనోత్తరరామాయణమున

ఉ. భూరివివేక చిత్తులకుఁ ◆ బోలు ననం దలఁపన్ దళంబులన్
     సౌరభ మిచ్చుగంధవహు ◆ చందమునం బ్రకటంబుచేసి యిం
     పారెడుపల్కులం బడయ ◆ నప్పలుకు ల్సరిగ్రుచ్చునట్లుగాఁ
     జేరుప నేరఁగా వలయుఁ ◆ జేసెద నేఁ గృతి యన్నవారికిన్.

క. తెలుగుకవిత్వము చెప్పం
     దలఁచినకవి యర్థమునకుఁ ◆ దగియుండెడు మా
     టలు గొని వళులుం బ్రాసం
     బులు నిలువక యొగిని బులిమి ◆ పుచ్చుట చదురే.

యని వాసియున్నాడు. ఇందువలన, శబ్దములను జక్కగఁగూర్చుటయు, యతిప్రాసములకొర కర్థగౌరవమును జెఱుపకుండుటయు సత్కవీంద్రమార్గమని తెలియుచున్నది. మఱియుఁ దనకవిత్వము (సరసమధురవచోగుంభనసుప్రసాదసంబోధన గోచరబహువిధార్థతాత్పర్యము" కలిగి యుండునని కూడఁ జెప్పియున్నాడు. దీనం బట్టి చూడ నక్షరరమ్యతయు, నర్థగౌరవమును సత్కవీంద్రసమ్మతమనియే తేలుచున్నది. నన్నయకాలమున నక్షరరమ్యత కంతయాదరము లేక పోయినను దిక్కన