ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

అడిదము సూరకవి.


సీ. భయ మేల కొండంత , పగతుఁడు నాకున్న
మేరువు వంచిన మేటి గలుగ
నాకేల శోకసం తాపంబునను గుంద
శీతాంశుమాళి 'నా చెంత నిలవం
దస్కరభీతికిఁ • దల్లడిల్లఁగ నేల
ప్రమధులతో శూల • పాణినిలువ
నగ్ని భీతికి నాకు • నళుకుఁ జెందఁగ నేల
గంగాధరుండు నాకడ వసింప


తే. ననుచు నెంతటి కేంతటి • కలుకు లేక
నమ్మియుంటిని నీ ప్రాపు • నామనమున
జాగరూకుఁడవై నన్ను • సాకు మయ్య:
రామలింగేశ రామచంద్రపురవాస.

పరిసమాప్తి.


ఇంతదనుక" సూరకవి గ్రంథముల నొక్కొక్క దానిని బ్ర త్యేకముగఁ దీసికొని నాకుఁదోచిన విధమున విమర్శనముఁ గావించితిని. ఇక నొక్కయంశము చర్చింపవలసి యున్నది. తనకుఁ బూర్వులగు కవులనుసరించిన మార్గములనే యితఁడను సరించెనా, లేక కొత్తతోవల నవలంబించెనా యన్న సంగతి పరిశీలింప వలసియున్నది. ప్రథమాంధ్ర కవియు వాగనుశాస నుఁడును నగు నన్నయభట్టు మహాభారతమున :


ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథా కవితార్థయు క్తితో
"నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప".

అని వాసియున్నాడు.