ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ఆడిదము సూరకవి.


“ బంకూల్, "-అనఁగా జైలుఖానా. యుండినస్థలమని యూహింపవచ్చును. బంకూల్' శబ్దవికారమే బొ.కులయినది. ఆకారాగారము శిధిల మైసశింప నాస్థలమును జనులు బంకూల్ దిబ్బయనెడివారు. అదియే రానురాను బొంకులదిబ్బయైనదని నిశ్చ యముగా మనము చెప్పవచ్చును.

పూసపాటి వారి కైఫీదు, డిస్ట్రిక్టుమ్యాన్యూల్, డిస్ట్రిక్టుగెజటీయరు మొదలగు గ్రంథముల యందు నీయఁబడిన యానాఁటి వృత్తాంతమును జూచినపుడు సీతారామరాజు గారి క్రౌర్య ము, నిరంకుశాధికారము మున్నగునవి వెల్లడియగును. కాని “యప్పటి యవసరమును బట్టి, యాతఁడా రీతిగఁ జేయపలసివచ్చె'నని దృఢముగఁ జెప్పవచ్చును.


నూతన రాజ్య నిర్మాణమునఁ గలుగు కష్టములను న్యాయబుద్ధితో సరయఁ బయత్నింపని వారలీ సీతారామరాజుగారి పరిపాలనా విధానములను నిందింపవచ్చును. ఇల్లు నేఁ జెప్పఁ బూనినను సీతారామరాజుగారి యందెట్టి లోపములును లేవనిచూప నేనుద్యమింప లేదు. సూరకవి బలవత్తరమగు నీ దూషణ గర్భ కావ్యము {Satire) నిహేతుకముగ వ్రా సెనని నాయభి ప్రాయమెంత మాత్రముగాదు. తగిన కారణములుండిన నుండ వచ్చును. ఏది. యెట్లున్నను నీశతకము పండిత పామర జనరంజకమై యాంధ్ర వాజ్మయమునఁ గల శతక రాజములలో నుత్తమ స్థానమధిష్టించి యున్నది. కవితా ధోరణిని తెలుపఁ గొన్ని పద్యములిచటఁ బొందుపంచు చున్నాఁడను.