ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము.

131


లుంగారి రాజ్యకాలమున దివానుగా నుండిన సీతారామరాజు చండశాసనత్వమును, దద్వారమున దేశమునకుఁ గలిగిన ప్రజాపీడయు, నాఁటి సాంఘిక స్థితియు, రాజకీయ స్థితియు నిందు నన్యాపదేశముగ వెల్లడించుటయే కవి ముఖ్యాభిప్రాయమైనట్టు గ దీనిఁజదివిన వారికిఁ దప్పక స్ఫురింపక మానదు. సీతారామ రాజుగారు 'పెట్టిన బాధలే యీగంథము కవి వ్రాయుటకుఁగా రణమని యాంధ్ర కవుల చరిత్రమిట్లు నుడువుచున్నది.


సీతారామరాజు గారిట్లు పరరాజులను జయించుటయేకాక తురక దొరలు మసీదులకిచ్చిన భూములను, పూర్వ రాజులు బాహ్మణుల కిచ్చిన మాన్యములను గూడ లాగుకొని ప్రజలను సహితము క్షోభ పెట్ట నారంభించెను. ఈయన పెట్టుబాధలే సూ రకవిని రామలింగేశశతకముచేయునట్లు చేసినవి. ” ఈ యూహ సరియైనను గావచ్చును. - కొని ,యాకాలపు విజయనగర రాజ్య వ్యవస్థకును బాగుగ గమనించి చూచినచో సీతారామరాజుగారి చండశాసనత్వమును, పరిపాలనా ప్రావీణ్యమును, రాజనీతి వైదుష్యమును నీ పూసపాటి రాజ్యమును గొప్పయాన్నత్యము నకుఁ దెచ్చుటకుఁ గారణములయినవని చెప్పితీరవలెను. విజయ నగరము వారికిఁ బక్కలోని బల్లెములవలె నుండిన ప్రబలులగు గాజులను మన్నె రాజులను జయించి రాజ్యమును విస్తరింపఁజేసి నదీ సీతారామరాజుగారే. సులభముగ లొంగుపాటులోనికి రాని జమీదారులకు దమ చాకచక్యను. చేఁ బట్టి తెచ్చి విజయనగ గా రాగృహబద్ధులుగం జేసెడివారు. ఇప్పుడీ పట్టణమునఁ గోటను నెదుటనున్న '( బొంకులదిబ్బ.' ,యను బయలు 'నాఁడు రమునఁ గా