ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

అడిడము సూరకవి.


కాని యిందును బొరపాటులు గలవు. 'లక్ష్మీ విలాసా విదుషాం కటాక్షా వేంకట ప్రభో?! అనుదీనియందలి (వేంకట ప్రభో!' అను దాని బట్టి దీక్షితుల వారు తమ పోషకులను స్మరించిరనివ్రాసిరి కాని యియ్య ది జయ దేవ , కృతచంద్రాలోకముననే కాన వచ్చుచుండుట చేత సుమాకాంతముగారి యూహ సరికాదని చెప్పవలెను. ఇచ్చటి వేంకటప్రభు శబ్దమును- దైవపరముగాఁ దీసికొనవలెను. గాని ప్రభుపరముగా ముడి వేయరాదు. కాబట్టి సూరకవి యాంధ్రీకరణమునకు జయ దేవుని గ్రంథమే మూల మని తలఁపవలెను.

సూరకవి యాంధ్రీకరణము సంస్కృత చందాలోకము నకుఁ జూలవఱకు దగ్గఱగనే యున్నది. అప్పయ దీక్షితుల వారి గ్రంథసహాయము నితఁడ పేక్షింపక పోలేదు. అవసరమగు పట్లగువలయానందములోని విషయముల నితఁడు గ్రహించి వాడు కొనెను. మొత్తము మీఁద సురకవి యాంధ్రీకరణము సరసముగను, ఉపయోగ రముగను నున్నది. ఉదాహణము కయి కొన్ని శ్లోకములను, పద్యములను నిచటఁ జూపు చున్నాఁడను.


శ్లో ఈపమా యత సాదృశ్య | లక్ష్మీరుల్ల పతిద్వయోః |
హంసీవ కృష్ణతేకీర్తి | స్సవంగా మవ గాహ తే || :
వక్ష్యో సమాన ధర్మాణా | ముపమా వాచక స్యచ |
ఏకద్విత్యు " ను పాదానా ! ద్భిన్నా లుప్తోపమాష్టధా ||

గీ వర్ణ్యముపమాన ముపమాన వాచకము స
'మానధర్మము సంఘటిం • పనగునుపమ ;