ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

అడిదము సూరకవి.

3.చంద్రాలోకము:- ఇది యొకయలంకారశాస్త్రము. దీనిని బీయూషవర్ష బిరుదాంకితుఁడగు జయ దేవమహాకవిసంస్కృ తమున రచియించెను. ఇందలి భాగములకు మయూఖములని పేరు. అవిపది. అందు నైదవ మయూఖములోని యథాకాలం కారములను నూటిని దీసికొని సూరకవి తెనిఁగించెను. సంస్కృ తచంద్రాలోక కతౄత్వము నేలకో .సూరకవి కాళిదాసున కా రోపించుచు నిటొక పద్యమును జెప్పి యున్నాఁడు.

గీ. బాలురకు నైనఁ దెలియంగం • గాళిదాసు
షునురచించెఁ జందాలోక • మునుద్రిలింగ
భాషజేసితి నీకృప • భవ్యముగను
దీనిఁ గరుణించి కై కొమ్ము • దేవ దేవ,


ఈవిషయమున సూరకవి పొరపాటు పడెనని చెప్పకతప్ప దు. ఏలయనఁ జంద్రాలోకమను దానినిఁ గాళిదాసురచించినట్టు గానీ యట్టి ప్రచారమున నున్నట్టు గాని తెలియరాదయ్యెను. ఒకప్పుడు సూరకవికి దొరకిన సంస్కృతగ్రంధమున ( కాళిదా సకృత చంద్రాలోకమని ఆ యుండిన నుండవచ్చును. ఆ వ్రాత యందలి యథార్థమును బరిశీలింప నవసరము లేదనుకొని సూర కవి యీతీరునఁ బొరపడియుండిన నుండవచ్చును. ఈ రీతిగ భ్ర మపడిన వారింకొకరగపడు చున్నారు. వారు వురాణనామచంద్రికను వ్రాసిన యెనమండ్రం వేంకటరామయ్యగారు. ఆయన తమ గ్రంథములో నిట్లు వ్రాసి యున్నారు: ---