ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము.

116


కవిసంశయవిచ్ఛేదము:- ఇది మూఁడు : ప్రకరణముల లక్షణగంథము. ఇందలి ప్రకరణములకు దరంగములని పేరు.అందు మొదటి రెండు తరంగముల యందును గవి తనకుఁబూర్వముననున్న వ్యాకరణములలో లేని కొన్ని నూతనవిషయములను జేర్చి వానికి సూతములుగల్పించి లక్ష్యములను భారతాది గ్రంథముల నుండి చూపియున్నాడు. రెండవ "తరంగమునందు శకటరేషనిర్ణయమును గూర్చి కొంతవఱకును, మూఁడవ తరంగమునందుఁ దద్భవములు గలిగిన విధమును గూర్చి కొంతవిపులముగను వివరించి యున్నాడు. దీనియందుఁ దాను జేసిన నియమములను సూరకవి యిట్లు చెప్పియున్నాడు.


క. కవిజన సంజీవనిలోఁ
దవిలినపద్ధతులు మఱియి • తరలక్షణల
క్ష్యనిర్దిష్టగతులు చె
ప్పవలయునని వేఱయొక్క • పద్ధతి చేతన్ .

క. ప్రియమందఁగఁ గవులు కవి
త్రయనుకవిత్వాసరణి దప్పక కవిసం
శయవిచ్ఛేదంబను నా
హ్వయమిడి లకు ణ మొనర్తు • నార్యులు మెచ్చన్

,


భారతాదిగ్రంథముల యందు మహాకవులు ప్రయోగంచిన ప్రయోగములను సూరకవి లక్షణ. సమ్మతములుగా సాధింఛి యుదాహరించెను. అట్టివానిని గొన్నింటి నీదినువఁ జూపుచున్నాఁడను.