ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఆడిదము సూరకవి


దివిబెలుంగు మెఱుంగుఁ • దీఁగెయటర్థంబు
తేట తెల్లంబు గాఁ • దెలియవలయు

గీ. నలఁతి తొలపడ్డ చంచమం • డలమువలన
జలజలను రాలునమృతంపు • జాల లీల
రసముతులకింప వలెనట్టి • రమ్యకవిత
రసికరసనా రిరంసచేఁ • బ్రబలకు న్నె.

ఇట్టి యాదర్శమును దనముందిడు కొనిన వాఁడగుట చేతనే సూరకవి యీప్రబంథమును గవిజనహృదయా వర్షకముగ నొనర్చి యన్వర్ణాభిధానముగఁ జేసి యున్నాడు. కథా సంవిధానమునఁ జెప్పఁబడిన చంద్రమతీ హరిశ్చం ద్రులయన్యోన్యా నుగాగ బీజము వారివారిచిత్రపటములను నొం డోరు లుపలక్షించుట చేతనే మొలకలెత్తిన వని చెప్పియు బ్రా హ్మణసం దేశమునుజొనిపియు" సంభావ్య విషయనిరూపణము గావించి, యిరువురు రాజ్యాధిపతులు వియ్యమందిన విధమునఁ జంద్రమతీ హరిశ్చంద్రుల వివాహమహోత్సవమును క్షత్రి యోచిత, మర్యాదల ననుసరించి మిగుల మనోహరముగ నభివర్ణిం చియున్నాడు. దృఢవ్రతుఁడను బాహ్మణుఁడు హరిశ్చం ద్రుని దరికి దూతగా వచ్చిన సందర్భమున... నాయతిథిని హరిశ్చం. ద్రుడు పూజించుటలో " వైదిక సంప్రదాయము ననుసరించి సం స్కృత భాషా మయముగ, నతిథి సత్కారవాక్యములనుగవియిట్లు నడపియున్నాడు.