ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియన ప్రకరణము.

111


నవనిఁబాణిని ఘటితనూ తార్థసరణి తెనుఁగు టీకలచేత సాధింపనగునె.

అను నీపద్యమును బట్టియు, శ్రీ రామదండకములోనిసం స్కృతపద భూయిష్ఠమగు రచనను బట్టియు, కవిసంశయ విచ్ఛే దములో నితఁడు వాడిన "ల్యప్పు " మున్నగు వ్యాకరణపరి భాషను బట్టియు నితనికి సంస్కృత వ్యాకరణమునఁ జక్కని జ్ఞానముక లదని నూహింప వచ్చును.

సర్వవిధముల నుత్తమ కవిత్వమని చెప్ప నొప్పునది యెట్లుం డవలెనో సూరకవి, తనకవి సంశయ విచ్ఛేదములో నిట్లు చెప్పియున్నాఁడు.

  • సీ.యతి, యుక్త వాక్యాను • గతినంటవలయు వ

త్సంబు ధేనువు వెంటఁ • దవిలినట్లు
మెట్టు మీఁదను గాలు • పెట్టఁగై దండ యం
దిచ్చినట్టులు పాస • మెనయవలయ
సానఁబట్టిన మణి • చందానఁబదమర్థ
నారీశుభంగిబం • ధంబువలయు

  • సూరకవి యీయ భిప్రాయము నే తన యితర గ్రంథముల యందుఁ

గూడఁ దెలిపి యున్నాఁడు-

1. గీ. కవిత నేరుపుయతి గూర్చు • కరణి దెలుపు. (రామలింగేశ శతకము)

2.

క. యతీ దవలవలయు వాగసు
గతి ధేనువు వెంటనంటి • కదలెడు వత్సా
కృతి నదియె కవనచతురిమ
వితరణఖని ! పొణ్గుపాటి • వేంకటమంత్రీ.

(వేంకటమంత్రి శతకము.)