ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

అడిదము సూరకవి:


సూరకవి కవిత్వము,

సూరకవికిఁ బిదపనో లేక యతఁడు జీవించియున్న కాలముననో యీ కవిజనరంజనము పండితుల యాదరణమునుబొందియాంధ్ర కవి ప్రపంచమున సబ్బయామాత్య కృతమగు కవిరాజుమనోరంజనము మొదలగు గ్రంథములతో పాటు పిల్లవసుచరిత్ర మను ప్రసిద్ధిగాంచినది. అట్టి ప్రసిద్ధిని పొందుటకు దీనియందలి వసుచరిత్ర పుఁబోలిక లొక కారణమయి యుండుటగ్రంథమునందలి వర్ణ నాంశముల పట్లఁగవి చూపిన ప్రేమ యు రసపోషణమును బ్రథాన హేతువులై యుండవచ్చునని తోచెడిని. కథా విన్యాసమునఁ గల్పనా కౌశలమును జూప నవకాశము లేక పోయినను గవి వర్ణ నాంశముల పట్లఁ దన ప్రౌఢిమను జూపి యాధునిక ప్రబంధకవీశ్వరులలో నుత్తమ స్థానము నధిష్ఠించెను.

ఈకవివరుసకు సంస్కృతాంధ్రముల యందుఁ జక్కనివైదుష్యము కలదు. ఇతఁడు సంస్కృతమున నాటకాలంకార సాహిత్యము కలవాడగుటయే గాక పాణినీయ వ్యాకరణ-జ్ఞుండుగూడనై యుండినట్టుగ నీతని గ్రంథములను బట్టి తెలియవచ్చెడిని. కవిసంశయ విచ్ఛేదములోని

A. ఆంధ్ర మర్మంబుఁ దెలియంగ , వసుపుపడు నె
ప్రకటసంస్కృత రచితసూత్రముల చేత