ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

అడిదము సూరకవి.


ప్రబంధముల కవిత్వరీతులను గైకొని యన్వారాభిధాన మగు నీకవిజనరంజనమును జెప్పి యున్నాఁడు. ఈ యనుసరణములు కవియొక్క ప్రతిభకును గవితా సామర్థ్యమునకును గొఱతగా నెన్నఁబడరాదు గదా ? సరసకవితా సామ్రాజ్యపట్టభద్రుడగు పెద్దనార్యుడు మారన మార్కండేయ పురాణ మనుసరింప లేదా ! ఏదియెట్లున్నను సూరకవి మాతకృతిని మిగుల సరసముగను శ్లాఘనీయముగను గావించెనని చెప్పక తప్పదు.

సూరకవి కవిత్వమునందలి యర్థాలంకారములు.

అభ్యాలంకారము లనేకము లీకవి యీప్రబంథమునఁ బ్రయోగించియున్నాఁడు. అట్టియలంకారములుగల పద్యములు గొన్నింటి నీదిగువఁ జూపుచున్నాఁడను.

1. ఉపమ:

చ. పుర నిక టాంచితో పవన • పుష్పిత సాలములం గదల్చుచున్
సరనులఁ దేలుచున్ నుమర • జంపటలంబులఁ గొల్లలాడుచున్ సురుచిరకుంజపుంజములఁ • జొచ్చినటించుచు మంద గామలై
కరులవ లెంజరించుఁ జలి , గాడ్పులు షట్పదశృంఖలజ్జగన్ .

(కవిజనరంజనము 1 34 18 ప!)

2. క. కలశాబ్దిళంగి నిన్నెల
పొలిచెం దెలిదీపిలీవిఁ • బూర్ణసుధాంశుం
డల రె నచటనున్న రమా
లల నాధిపుభంగిఁ దత్కళంకంబొప్పెన్

(కవిజనరంజనము 8 ఆ: 83 ప!)