ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

87


వ్రతునకుఁ జెప్పి పుచ్చ నతఁడాశుభవార్తనుజంధ్రమతి జనకునకుఁ దెలియఁజెప్పెను. పిదప విజయాస్పదపురమునఁ గడువై భవముతో వివాహసన్నాహంబులు జరుగ హరిశ్చంద్రుఁడ యోధ్యానగరమునుండి తర్లి వెడలీ విధ్యుక్తముగఁ జంద్రమతిని బాణి. గ్రహణము చేసికొని సంతోషపూరితహృదయాంతరంగుఁడై మామ, యొసఁగిన యరణములతోఁ జంద్రమతినిఁ జేకొని యయోధ్యానగరమునకు వచ్చి సుఖముగ రాజ్యపాలన మొనర్చు చుండెను. .


ఈ కథనే సూరకవి, మూఁడాశ్వాసములలో 260 వద్య ములతోఁ జెప్పెను. అందుఁబ్రథ మాశ్వాసము పురవర్ణనాదికముతోడను, చంద్రమతి జననసౌందర్యాభి వర్ణణముతోడను ముగియును. ద్వితీయాశ్వాసమున, వసంతము, చంద్రమతివిరహము, మలయపవ నాద్యు పాలంభము, దృఢవత సందేశమును ననునవి వర్ణింపఁ బడినవి. తృతీయాశ్వాసమున హరిశ్చంద్రుని , కళ్యాణయాత్ర, చంద్రమతీ హరిశ్చంద్రుల వివాహమా హెూత్సవము, నూతన వధూవరుల గృహప్రవేశము, సూర్యాస్తమయ ము, తమస్సు, తారలు, చంద్రోదయము,ప్రభాతము, కోడికూత, సూర్యోదయము, మొదలగునవి యభివర్ణింపఁ బడినవి.


ఈ ప్రబంథరచన యందు 'సూరకవి తనకుఁ బూర్వులగు శ్రీనాధాది మహాకవులను నెక్కు డుగ ననుసరించియున్నాఁడు.