ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

అడిదము సూరకవి:


 "తే: గీ: సత్యమును దృఢవతంబుగా • సంగ్రహించి . . ,
రాజనూయాది వివిధాధ్వ రములొనర్చి
వరగుణోజ్జ్వలసంతాన • వంతుఁడైక
రమును సుఖముండెనాధరా , రమణమౌళి

అని చెప్పి హరిశ్చందనిపూర్వకథలోనే ప్రబంధమును ముగించినాఁడు. కథా విన్యాసమునఁ గల్పనా చాతుర్యమును జూపన వకాశమంతగాఁ జిక్కినది కాదు. ఇందలి కథను నొకటి రెండు వాక్యములలో నిట్లు చెప్పవచ్చును.

పూషవంశ భూషణుండగు త్రిశంకుభూపసుతుఁ డయో ధ్యానగరమును రాజధానిగాఁ జేసికొని భూమిని బరిపాలించు చుండఁ బుడమికిఁ దొడవగు విజయాస్పదపురమును దనకుఁ బ్రధాన నగరముగఁ గావించుకొని యుశీనరధరావరుఁడు రాజ్యపాలన మొనరించు చుండెను. ఆయుశీనరునకుఁ జంద్రమతి యను కుమారీ రత్నముజనించెను. ఆమెకు జవ్వనమంకురించిన పిదప హరిశ్చంద్రుని సుగుణసంపదను వినియును నతని మనోహరాకృతిని జిత్రపటమునఁ గనియును నతని యందే తన చిత్తమును హత్తించియుండ నాసమాచారము నామె చెలికత్తెల ముఖమున వినిన" వాఁడై యుశీ నరధరారమణుఁడు దృఢవ్రతుండను బ్రాహ్మణోత్త ముని హరిశ్చంద్రుని పాలికిఁబుత్తెంచెను. హరిశ్చంద్రుఁ డావిప్రుని వలనఁజంద్రమతి సుగుణసంపదయు, రూపలావణ్యాతిశయమును' విని తనకామె తగిన పత్నియనితలఁచి తనయంగీకారమునుదృఢ