ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

గ్రంథరచన.

క. రవియెఱుఁగును భువితత్త్వము
భువిలో పలనుండు జనులఁ • బోషించుసదా
శివుఁ డెఱుఁగు నాట్యతత్త్వము
కవితాతత్త్వంబు సూర్య కవికే తెలియున్.

(శ్రవిసమకాలికులు)

పదునెనిమిదవ శతాబ్దియందుఁ బౌఢ ప్రబంథ రచనకుఁ ప్రసిద్ధిగాంచిన కవులలో నొకఁడనియు, లాక్షణికుఁడనియు సూరకవి విశేషప్రఖ్యాతి గాంచెను. ఇతఁడు రచించిన గ్రంథముల లో నాంధ్ర ప్రపంచమునకు లభ్యములై ప్రచారములో నున్నవి యాఱు గ్రంథములు మాత్రము గానవచ్చుచున్నవి. (1) చంద్ర మతీపరిణయమను నామాంతరము గల కవి జనరంజనము. (2) కవిసంశయ విచ్చేదమను లక్షణ గ్రంథము. (8) చంద్రాలోకము (భాషాంతరీకరణము ) (4) ఆంధ్రనామ శేషము (నిఘంటు వు) (5) 'రామలింగేశ శతకము. (6) శ్రీ రామదండకము. ఇతఁ : చురచించిన గ్రంథములలోఁ గవిసంశయ విచ్ఛేదమున వ్రాయఁబడిన మూఁదునాలుగు కృత్యాదివద్యములు తప్ప మఱి దేని యందును గృత్యాదివద్యములు గానరావు. ఆ కారణము చేత : .