ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఆడిదము సూరకవి.


<సీ. విజయరామక్షమా - విభుఁదిట్టి భాసిల్లె
ధరణిలో మాప్రపి • తామహుండు .
గంగాభవానిని గడుదిట్ట యైతిట్టి
ఖ్యాతిఁ జెన్నొందె మా • తాతయొకఁడు,
నెలయంగ మగటిప ల్వెంకనఁ బడఁబెట్టి ,
తగఁ దెగటార్చె మా , తండ్రి గారు
ఆరీతి గాదిట్టి , యమపురంబునకును"
నిన్నుఁ బంపఁదలంచి యున్నవాడ పొగడఁ


గాచుకొమ్మిటుమీఁద న • ఖండచండ,
దారుణోద్దండ కవితాగ • భీరశక్తి
నీతరముగాదు కలహించి • నిర్వహింప
జల్ల పట్టాభిరామ నీ • చగుణధామ

.


ఈపద్యమును జెప్పిన బాలభాస్కరకవి రామకవికి వరుస కు మనుమఁడు. అందుచేతనే యతఁడు "........ఖ్యాతిఁ జెన్నొం డెమాతాత యొకఁడు ” అని రామకవిసి ప్రశంసించినాఁడు. సూరకవి విజయరామగజపతి మహా రాజునకు నాస్థానకవిగా నుం డెనని యైదవప్రకరణమున వ్రాసియే యున్నాఁడను. మాకు టుంబములోఁ దరముల వెంబడి వచ్చుచున్న వాడుకను గూడఁ బ్రబల ప్రమాణములలోఁ జేర్పఁదగినదిగా యోచించి మీది యంశముల నన్నిటిని బట్టి యాలోచించిన చోఁ జెఱువుమీది పద్యములతో సూరకవి కెంతమాత మును సంబంధము లేదనియు వానిని రామకవియే రచించెననియు స్పష్టముగాక పోదు,