ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొమ్మిదవ ప్రకరణము.

81



నామును బంచుకొని యనుభవించు చుండిరి. ఈయినాము భూముల నత్తియున్న నోముల చెఱువు పూర్తిగ నిండునపుడు కిత్తన్న వంతునకు వచ్చిన పొలమునకే ముంపుతగులును గాని తక్కినవారి పొలముల కంతగా ముంపుతగులదు. అందుచే నీటి ముంపువలన సస్య నష్టమును బొందిన రామనకే దీనితో సంబంధముగలిగి యుండెనని యూహించుట యుక్తముగాని ముంపు వలన నెట్టినష్టమును బొందని సూరకవ్యాదులకు సంబంధము కల్పించుట యుక్తముగాదని నాయభిప్రాయము.


3. మాయింటనున్న వాతప్రతులలోను మాయూరిలో నాస్నేహితుల వద్దనున్న ప్రతులలోను. "పేరురామన ” అని యే పాఠము గానవచ్చుచున్నది. మాగ్రామమునఁ గల పత్రుతులలో నెల్ల ఆకి సరవయ్యయను వైశ్యునిచే సంగ్రహింపఁబడినది ప్రాచీన మైనదిగఁ గానబడుచున్నది. ఇయ్యది యఱవది సంవత్సరముల కిందటి కాలమున గ్రామ పురోహితులగు రుద్రా, వజ్జల నరసింహము గారిచే వ్రాయఁబడినది.


4. ఇదిగాక సుమారు 50 సంవత్సరముల క్రిందటఁ గాలధర్మ మొందిన సూరకవి ప్రపౌతుఁడగు బాలభాస్కరకవి చె ప్పిన యీకింది సీసపద్యముచేత చెఱువుమీఁది పద్యములతో సూరకవికి సంబంధము లేదనియు వానిని రచించినది. రామకవి : యనియు స్పష్టమగుచున్నది. 11