ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii


పరాక్రమాతిశయములవలన నన్వర్థ నామ మైయుండును. గ్రంథ పారణమునునది పామరులనోట బడి రూపుమారిన 'గండవారణ' యను బిరుదము. ఇది నీలాద్రి కవికి సేనాధిపతిత్వమువలన చెల్లియుండును. ఆతని తరువాతివారు గ్రంధ వారణమువారయి యుందురు. అట్లే గోదావరి మండలమందలి మోదుకూరు కాపురమువచ్చిన యడిదము వారికుటుంబము మొదట మోదుకూరి యడిదమువారయి రాను రాను. మోదుకూరువారయి యుందురు. ఇట్లు గృహనామములు: మారుట కెన్ని యో నిదర్శనములు కలవు. కాని సూరకవిగారి . కుటుంబమువారు మాత్రము నీలాద్రికవి గారి కోవలోనివారే.

సూరకవికీ తొమ్మిదవ పురుషుడగు నీలాద్రికవినాటి నుండి ఈ కళింగ భూపతుల' (అనగా విజయనగర పూసపాటి వంశమును). నాశ్రయించిన వారమని సూరకవి చెప్పిన. చాటువుతో నీ గ్రంథము ప్రారంభింపబడినది. ఈ నీలాద్రికవినేలిన పూసపాటి ప్రభువు రాచిరాజు గారో (1) అతని కుమారుడగు తమ్మ రాజు గారో కాపలెను. వీరి ప్రసిద్ధినిగూర్చియు, ప్రతాప మును గూర్చియు పూసపాటి రాజకవులు రచించిన ప్రబంధములలో, నీ క్రింది విధమున బ్రశంసలు కలవు. --

శ్రీమన్మహామండలేశ్వర శ్రీ పూసపాటి రాచిరాజు (1) గారు.

 మ. దిననాధద్యుతి రాచిరాజు రణధా - త్రిందా మెరాధీశు తి
మ్మ ననోడించెఁ జళుక్యవీర ఘనరా , జ్యస్థాపనాచార్యతన్ -
గనియెన్ మ్లే చ్చు: గెల్చి తద్వివిధ దు ర్గగ్రాహియై ప్రౌడదే
వనృపాది ప్రభు భీషణ ప్రధిత ది. ఈ వ్యద్విక్రమ ప్రౌధిచేన్ .
(విష్ణుభక్తి సుధాకరము)

ఉ. వారలలోన రాచనృప వర్యుఁడు దామెర తిమ్మభూవరున్
చౌరుషనృత్తి గెల్చి తన ఆ బంటుగఁ జేకొని మ్లేచ్చరాజులన్ -
బోరుల గెల్చి దుగన్ ముల , నుంగొని మాళవరాజు'గెల్చె త ..
త్పౌరుషులబ్ద మన్యనుల , తాన్ బిరుదంబు సహించే నెంతయున్ .

అ!! వె! పౌఢ దేవ రాయ • బహుమతుండైనుంచే
ధర చళుక్యవంశ • వరసృపాలు - .
రాజ్యలాభమునఁ బెలంగిం చటం దదంక
బిరుదనాను మొంది పేరుగాంచె