పుట:2030020025431 - chitra leikhanamu.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

తుప్పలకు గెంబోజియును వేయుట మంచిది. దగ్గర నున్నచెట్లకు ఆకుపచ్చను, బరంటు శయనారంగును వేయుట యుక్తము. గాడ మైనఆకుపచ్చ నెంతమాత్రము నుపయోగించరాదు.

మార్పులు, దిద్దుబాట్లు:- రంగులను వేయుటయం దనేకతప్పులకు లోనౌదుము. అందువలన దిద్దుట యనవసరము. కావలసినచోట్లయందే దిద్దవలెను కాని అనవసరముగ నీపనిని చేయరాదు. ఇటుల చేసినయెడల కాగితము చెడిపోవును. చిన్నదిద్దుబా టేమైన నున్నయెడల చిన్నతడిగుడ్డతో నైనను, రొట్టెతో నైనను చెఱపవచ్చును. ఈపనిని చేయునప్పుడు కాగితము కరకుగా నైపోయినయెడల గోరుతో నదిమిన నున్న నైపోవును. విస్తారము దిద్దుబా ట్లున్నయెడల సముద్రపుపాచి (Sponge) నుపయోగించుట యుక్తము. చెరుపునప్పుడు ఇతరస్థలములయందు ఈపాచి తగిలి చిత్రము చెడిపోవును. కనుక ఎంతవఱకు చెరుపవలయునో అంతవరకు మఱియొకడ్రాయింగు కాగితముపై కన్నము చేసి దాని స్థలమునం దుంచి తడిపాచిముక్కతో దానిపై వ్రాయవలెను. చిత్రముపై నొక్కచోటుననే దీనిని విస్తారముసే పుంచరాదు. పాచియందు విస్తారము జల ముండరాదు. చెరిపిన చోటున మఱియొకమారు చిత్రించవలె నన్న నిదివరకు చెప్పినపద్ధతి ననుసరించవలెను. స్పాంజితో చెరుపునప్పుడు కాగితము చెడిపోవచ్చును. అట్టి స్థలమునందు రంగులు వేయుట కష్టము. ఈస్థలమును బాగుచేయుటకు మఱియొక్క పద్ధతి యున్నది. చెడిపోయిన చోటును మంచియిసుకకాగితముతో (Sand Paper) మెల్లగ వ్రాసినయెడల కాగితమునకు తొలిరూపు వచ్చును.

చిన్నతప్పులను దిద్దుటయందు స్పాంజితోను, తడిగుడ్డతోను, రొట్టెతోను తుడుచుటకంటె జాగ్రత్తతోనచ్చోట తెలుపును వేసిన చాలును. ఈరంగు బాగుగ నారినతరువాత దీనిపై మీయిష్టమువచ్చినరంగులను వేయవచ్చును.

సమాప్తము:- పైనచెప్పిన వన్నియు బాగుగ తెలిసియుండవలెను. వీటిని కంఠపాఠము చేయు మని నా యుద్దేశముకాదు. ఈచిన్నగ్రంథమును దగ్గర పెట్టుకొని యిందు చెప్పియున్నప్రకారము చిత్రించుచున్నయెడల నదియే యలవడును. పిమ్మట నీవే స్వతంత్రుడవు కావచ్చును. అభ్యాసము చేసినకొలది నిపుణత్వము ఎక్కువ కాగలదు. గొప్పచిత్రకారులు వ్రాసి పూర్తిచేయునటువంటి చిత్రములను చూచి మనము విస్తారము నేర్చుకొనగలము. సుప్రసిద్ధ చిత్రకారుడు చిత్రించుటను చూచుటకంటె యీవిషయమున భాగ్యము కలదా?ఇట్టివి చూచుటవలన పూజ్యు లగునాపురుషులు ఎటుల రంగులను వేయుచుండిరో మనకు విశదమగును.

వివిధతరగతులయం దుండుచిత్రములను జాగ్రత్త చేసికొని వాటిసహాయముద్వారా రంగులను నేర్చుకొనుట మంచిది. ఎచ్చట నైన తెలియకపోయినయెడల కొంచెము వాటివైపున దృష్టిని నిగిడించిన చాలును. కష్ట మంతయు తొలగిపోవును.

ఇంతటితో నీవిషయము చాలింతము.

ఐదవ భాగము.

వివిధాంశములు.

నిలిచియున్ననీరు, ప్రతిబింబములు:- నిలిచి యున్ననీటియందు నలువైపుల నున్నవస్తువులు ప్రతిఫలించును. అందు కెరటములు లేనిసమయమున నెన్నియో చిత్రములను చూడ నగును. అట్టిచిత్తరువులను వ్రాయగలవాడే ధన్యుడు. కాని మనము కొంచెము దూరము నుండి చూచినయెడల నవి యన్నియు కానరావు. గాలివలన చిన్న