పుట:2030020025431 - chitra leikhanamu.pdf/57

ఈ పుట ఆమోదించబడ్డది

పుష్టిగను ఉండును. బాలురు స్తనములనుండి పాలనుపీల్చుటకు కీయాకారము మిగుల ననుగుణముగ నుండును. ఈవయస్సునందు నోరు భావమును ప్రదర్శింపదు. వీరు కండ్లతోనే సాధారణముగ నవ్వుచుందురు.

పండ్లు పుట్టినప్పటినుండి దీనిరూపు మాఱిపోవును. అచ్చటనుండి కండ్లతో గలసి యిది భావమును ప్రదర్శింపు చుండును. వార్ధక్యమునం దీపండ్లు రాలిపోవును. కాన పెదవులు లోపలికి క్రుంగిపోవును. అచ్చటనుండి నోటిరూపును, భావమును చెడిపోవును.

బాలురయొక్కయు, యుక్తవయస్కులయొక్కయు, నోళ్లు మిగుల పుష్టిగను, రక్తవర్ణముగ నుండును. సిగరెట్లను పీల్చిన నివి నల్లగ మాఱిపోవును. రెండు పెదవులకును మధ్య నుండుఛాయను, పెదవులకొనలయం దుండుఛాయను భావమును మిగుల శ్రద్ధతో ప్రదర్శించుట యవసరము.

కండ్లును, పెదవులును, భావమును వ్యక్తపఱుచును. కనుక కండ్లయం దెట్టిభావ ముండునో నోటియందు నట్టిభావమునే కనపఱుపవలెను.

ముక్కు:- కండ్లమధ్య నుండుస్థలమువద్ద ప్రారంభించును. ఇచ్చట లోతుగ నుండి కొనయందు మిగుల నెత్తుగ నుండును.ముక్కు మిగుల మెఱయుచుండును. ఈమెఱపు కొనయందు విస్తారము. నాసికారంధ్రముల యందు ఛాయ అతిదట్టముగ. దీనికిగాను నలుపును, వేండిక్కుబ్రౌనును, బరంటుశయనాను, నీలిని ఉపయోగించెదరు.

ముక్కుకూడ కొంతవరకు ముఖముయొక్క భావమును కనబఱుచును. కొన్నిసమయములయందు నాసికారంధ్రములు గుండ్రమైన యాకారమును దాల్చుచుండును. సంతోషసమయమునందు మిగులవెడల్పుగా నుండును.

నాసికవలన ఛాయ విస్తారముగ ముఖమునందు కానవచ్చును. ఈఛాయవలన ముక్కు యెత్తుగ నున్నటుల ప్రదర్శింపవలెను. ఈఛాయవలననే దీని కొకయాకారమును చిత్రమునం దియ్యవలెను.

చెవి:- దీనిని చిత్రించుటయందు సుప్రసిద్ధచిత్రకారులు శ్రద్ధవహించలేదు. వారి నడిగినయెడల "దీనికి భావము లేదు. అన్నియు ఒకేవిధముగ నుండును. దీని నెటుల చిత్రించినను రూపున కేమియు మార్పును గలుగజేయదు, అని చెప్పుచు వచ్చిరి. దీనికిభావము లేకపోవుట నిజమే. కాని అన్నిచెవులు ఒకేవిధముగ నుండు ననిననే నొప్పుకొనను. ఏవైపున వెలుతురు పడునో ఆవైపున నున్నచెవిని మిగుల జాగరూకతతో చిత్రించవలెను. సాధారణముగ నివి తలవెండ్రుకలచే కప్పబడి యుండును.

చెవియం ననేకము లెత్తుపల్లము లున్నవి. దీనిచర్మము మెఱయుచుండును. అందువలన నిందు ఛాయను చిత్రించుట కొంచెము కష్టము కాని మొత్తముమీద నిది అంతముఖ్యమైనది కాదు.

బాలురచెవులు గుండ్రముగ నుండును. వయస్సు ముదిరినకొలది నివి కోలనై పోవును.

జుట్టు:- ముఖమువలెనే యీజుట్టి సర్వదా యెకేరూపును దాల్చి యుండదు. వారివారి యిష్టములప్రకారము పురుషులు కాని స్త్రీలుకాని దీనిని దువ్వెదరు. ముఖముయొక్క ఛాయనుబట్టి దీనిఛాయ మారుచుండును. మెరయుచోటునం దనేకరంగులను వేసెదరు. దీనివిషయమై యిదివరకే చెప్పితిని.

పాపటను జాగ్రత్తగ చర్మపురంగుతోను, జుట్టునకు వేయురంగుతోను చిత్రించవలసి యుండును.

మెడ, భుజములు:- భుజములయొక్కయు మెడయొక్కయు రంగులు ముఖముమీద నుండునంతదట్టముగ నుండవు. సుందరాకారులయొక్క మెడయు భుజమును ముఖముయొక్క రంగులను చెందియుండును. ఇట్టిసమయములయందు ముఖములకు వేసినరంగులనే వేసి కొంచెము కళను తగ్గించవలెను. లేనియెడల ముఖముయొక్క ప్రాముఖ్యము తప్పిపోవును.

దురభ్యాసములు గలవారియొక్కయు, రోగులయొక్కయు మెడమీది దుమ్ములు స్పష్టముగ కనపడును. ఇవి