పుట:2030020025431 - chitra leikhanamu.pdf/55

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిభాగమును గుండ్రముగ చేయవలెను. ఈరూపము నిచ్చునది ఛాయ యని మీ కిదివఱకే తెలియును. అందువలన ఛాయను తప్పులు లేకుండ చక్కగ చిత్రించుటయందు జాగరూకత వహించి యుండవలెను. ప్రతిఛాయకు గ్రేవర్ణపుఅంచు ఉండు నని మాత్రము మఱచిపోకూడదు. చాలవిస్తారము ఆకుపచ్చగ నుండిన ఊదాతోను, ఊదాగా నుండిన నాకుపచ్చతోను, నీలిగ నుండిన నారింజరంగుతోను దిద్దుకొనవలెను. చర్మపురంగు ఆకుపచ్చగ నుండిన నెఱుపుతో సవరించవలెను. గుండ్రముగ నున్నస్థలములయందు బూడిదవర్ణము పూయవలెను. నోటియొక్క యిరువైపులను ఛాయరంగును వేసి అంచులను నీలితో చిత్రించవలెను. గడ్డముయొక్క క్రిందిభాగమునం దుండు దట్ట మైనఛాయ నీలిమిశ్రిత మైనసిపియారంగుగ నుండును. నొసటిమీదిఛాయయొక్క అంచు ఆకుపచ్చగ నుండును. చెవియం దుండుఛాయ మిక్కిలి దట్టముగ నుండును. కనుక ఎఱుపుకూడ కొంచెము వేయవలసి యుండును. చిత్రించుట పూర్తియాయెను. ఇంకను ఏయంశముల ననుసరించి పైచెప్పిన దంతయు చెప్పబడెనో విద్యార్థి తెలుసుకొనుట మంచిది.

తెలుపు, పసుపు, పచ్చ, పలుచని ఎఱుపురంగులు ఛాయయందు కొంచె మెఱుపుగ కనబడును. నీలి చాలవఱ కుపయోగించితిమి. చర్మపురంగుపై నీలిని వేసినయెడల బూడిదవర్ణముగ మాఱి చిత్రమునకు సౌందర్యమును గలుగజేయును. పై చెప్పినచర్మపురంగు లన్నియు ప్రథమరంగుల (ఎఱుపు, నీలి, పసు పచ్చ) ననుసరించియే యున్నవి. సదుపాయముకొఱకు ఎఱుపునకు బదులుగా తేలిక యైన ఎఱుపురంగును, గులాబిరంగును, చిందూరపురంగును నుపయోగించితిమి. కాని ప్రథమరంగులుమాత్రము చాలును. ఈమూడురంగులతోనే చిత్రించుట కష్టమైనపని. అభ్యాస ముండిననే కాని యిటుల చేయజాలరు. అనేకరంగులు మనకు లభించుసమయమున నీమూడురంగులతోనే కాలము గడుపుట ఎందుకు?

వాటుమేన్సు డ్రాయింగు కాగితము (Whatman's Drawing Paper) మీదను వ్రాయుట యత్యానందముగ నుండును; కాని యీకాగితమును నున్నగచేయుట కుపాయ మాలోచింపవలసియున్నది.

నీచిత్రము నొక నున్ననిఫలకముపై నిదివరకు పైచెప్పినప్రకార మంటించి దానిపై నున్నని పలుచని కాగితమును (Tissue Paper) బిగువుగా తగుల్పవలెను. పిమ్మట నొకతాళముచెవితో నైనను, నున్నని యుంగరముతో నైనను, జాగరూకతతో నణచి వ్రాయవలయును. కాగితము చినిగిపోకుండ, గీతలు పడకుండ చూచుకొనవలెను. ఇటుల కొంతకాలము చేసినయెడల చిత్రము నున్నగ నైపోవును. ఇటుల నెంతచేసిన నంత నున్న నౌను.

వెలుతురుపడు చోటులను మొదట రంగువేసినప్పుడు విడిచివేయుటకంటె, రంగు పూర్తియైన పిమ్మట తీసివేయుట మంచిది. ఆస్థలమును నీటితో గుఱుతుపెట్టుకొనవలెను. శుభ్రమైనయొకకుంచెను శుభ్రమైననీటిలో ముంచి ఆస్థలము నలువైపుల నీటిగీతను గీయవచ్చును. తరువాత తడిగుడ్డతో నైనను, చిన్నరొట్టెముక్కతో నైనను మెల్లగ తుడువవలెను. ఇట్టిరొట్టెయందు రంగేమియు నుండరాదు. దీనిని తడిగుడ్డతో కప్పియుంచుట మంచిది. ఇట్టిదానితో ఆరేడు నిమిషములు చెరిపిన చాలును.

కంటిపాప మెరయుచుండును. అచ్చోట తెల్లగ కానవచ్చును. అందువలన నీస్థలమునందు తెలుపురంగును వేయవలెను. దట్టముగ తెలుపురంగు నరుగదీసి, సన్ననికుంచెతో నీరంగును తీసి జాగరూకతతో వేయవలెను. కండ్లు ముఖ్యము. అందువలన నీవిషయమై మిగుల శ్రద్ధను పుచ్చుకొనవలెను.

వెనుకభాగమునకు మెరుగు నివ్వవలె నన్న బంకను దీనిపై పూయవచ్చును. ఒకభాగము మంచిబంకను, ఏడు భాగముల పరిశుభ్రమైన నీటియందు కలిపి వేయవలెను. ఎంతకొంచెము బంక నుపయోగించిన నంతమంచిది. చిత్రము పూర్తియైనవరకు నీపనికి పూనుకొనరాదు.

పైచెప్పినవన్నియు సౌందర్య మైనముఖమును గూర్చియే. కొందఱిముఖములు ఆకుపచ్చగను, మఱికొందఱివి