పుట:2030020025431 - chitra leikhanamu.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

దానికంటే ముందు చిన్న పటము వచ్చిన యడల రెండు మూడు మారులు పెద్దది చేయ వచ్చును. 14.... 2 చూడుము. పెట్టెను వ్రాయునపుడు 'క, ఖ ' అను గీతను కొలిచి నిట్రము (perpendicular) వ్రాయవలెను. తరువాత 'గ,ఘ,' లను నిర్ణయించ వలసియున్నది. పెన్సిలును ఆమూలలకు సమానముగాను, భూమికి సమాంతరము(parallel) గా నుంచి 'క,ఖ,' యను గీత నెక్కడ కలియు చున్నదో కనుగొనవలెను. తరువాత ఆగీత కీమూల లెంత దూరమున నున్నావో కొలచిన యెడల వీని యెక్క స్థలము నిర్ణయమగును.

ఈ మూలలనుండి "గ,చ, ఘ,చ, యను గీతలను క,ఖ, యను గీతకు సమాంతరము (parallel) వ్రాసి వాని యెక్క పొడవును కొలవలెను. అపుడు 'చ,ఛ,' లు నిర్ణయమగును. తరువాతను చ,క,, ఛ,క" "ఘ,క","గ.ఖ"అను గీతలను సులభముగా వ్రాయవచ్చును. ఇంక "జ" యను చుక్కను నిర్ణయించ వలెను. మునుపటి వలెనే పెన్సిలును "జ"అను చుక్కకు సమముగాను, భూమికి నిట్రము(perpendicular) గాను పెన్సిలునుంచి ఆ పెన్సిలు "చ,క"అను గీత నెచ్చట కలియుచున్నదో కనుగొనవలెను. తరువాత నాస్థలమునుండి "జ" యను స్థల మెంత దూరమున నున్నదో కొలిచి "జ"ను నిర్ణయించవలేను. అప్పుడు "ఛ,జ", "చ,జ" యను గీతలను గీయుట సులభము. ఈ విధముననే యే పెట్టెనైన గృహమునైనను శుభ్రముగ వ్రాయవచ్చును. కాని మునుపు చెప్పిన ప్రకారము కొన్ని గీతలొకచోటను, మరికొన్ని గీతలు మఱియొక చోటను, దిగంతము మీదను కలియునని జ్ఞాపకముంచుకొనవలెను. ఈ ప్రకారముగ మీరు వ్రాయు పటమునందు లేని యెడల వ్రాసినది తప్పని తెలిసికొనవలెను.

మూడవ ప్రకరణము

ముక్కోణపు ఆకారముగల ఘనపదార్థము.

ఇది వ్రాయుట సులభము. మునుపు చెప్పిన ప్రకారము 1, 2, 3,నెంబరు గలగీతలను గీయవలెను.ఇందు 4వ నెంబరు గీత యెకచోటను కలియును. కాని చక్ర వాళమునకు సమమైన గీతకు సమాంతరముగ నున్న గీత లెప్పటికిని కలియవు.