పుట:2016-17 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై సిఎజి నివేదిక.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2017 మార్చితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదిక


కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ద్రవ్య చరాంశాలకు సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాలను కాలానుగుణంగా సవరించవలసి ఉంది. అయితే, 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా ముఖ్యంగా రెవెన్యూలోటు, ద్రవ్యలోటు, మిగిలిన చెల్లింపు బాధ్యతలకు రాష్ట్ర స్థూల గృహోత్పత్తికి నిష్పత్తి మొదలైన ద్రవ్య లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా సవరించవలసి ఉంది. యూడీఏవై పథకం క్రింద ఖర్చు చేసిన 78,256 కోట్లను కలుపుకోవడం వలన ద్రవ్యలోటుకు, రాష్ట్ర స్థూల గృహోత్పత్తికి గల నిష్పత్తి 3.24 శాతం నుండి 4.42 శాతానికి పెరిగిందని ప్రభుత్వం సమాధానమిచ్చింది (పేరా 1.14.2ను చూడండి).

1.4.1 ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం వెల్లడించాల్సిన సమాచారాన్ని తెలియజేయకపోవడం

ఎఫ్ఆర్ బీఎం చట్టంలోని సెక్షను 10 కింద వెల్లడి చేయాల్సిన అంశాలను బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ప్రభుత్వం తెలియచేయాలని ఎఫ్ఆర్‌బీఎం నియమావళిలోని నియమం 6లో నిర్దేశించడమైంది. బడ్జెట్ తోపాటు వెల్లడి చేయాల్సిన 10 అంశాలకుగానూ, ఈ క్రింది వాటిని తెలియజేయలేదు.

(i) ఫారం డీ-7లో వెల్లడించాల్సిన ఆస్తుల వివరాలు;
(ii) ఫారం డీ-8లో వెల్లడించాల్సిన- రెవెన్యూ డిమాండులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్లయిమ్లు ,కమిట్ మెంట్లలో వసూలు కానివాటి వివరాలు; మరియు,
(ii) ఫారం డీ-9లో వెల్లడించాల్సిన-భారీ పనులు, కాంట్రాక్టుల తాలూకు చెల్లింపు బాధ్యతలు; భూసేకరణ చార్జీలు, పనులు -సరఫరాల తాలూకు పెండింగు బిల్లుల క్లయిమ్లకు సంబంధించి తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తాల వివరాలు

అంతేకాక, రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఏటా పింఛన్ల కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని బీమా గణన ప్రాతిపదికన లెక్కగట్టాలని నిర్దేశించిన ఎఫ్ఆర్‌బీఎం చట్టం-2005లోని నిబంధన 7(2)(iii)ను ప్రభుత్వం పాటించలేదు.

నిర్దేశిత సమాచారాన్ని వెల్లడి చేయని కారణంగా, ఎఫ్ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఆస్తులు-అప్పుల వాస్తవ విలువల వెల్లడిలో మరింత పారదర్శకత ఉండేలా చూడాలనే లక్ష్య సాధనలో రాజీపడటం జరిగింది. వెల్లడించవలసిన అంశాల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ 2018-19 నుండి ఈ చట్టంలోని అంశాలను అనుసరించేలా నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది.

1.42 కమిటీల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. అవి (i) వినియోగంపై దృష్టి సారిస్తూ ఖర్చు నిర్వహణా సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక విధాన రూపకల్పన కోసం ద్రవ్య నిర్వహణ కమిటీ[1] (i) 2016-17 సంవత్సరం నుండి ఆర్థిక ప్రణాళికను సమన్వయం చేయడానికి ద్రవ్య మరియు ఆర్థిక విశ్లేషణ విభాగం (ఎఫ్ ఈఏడీ)[2]. ఈ సంవత్సరంలో సదరు కమిటీలపై 121.60 లక్షలు వెచ్చించారు. ఐతే, ఈ కమిటీలు ఎటువంటి నివేదికలనూ సమర్పించక పోవడం వల్ల, వాటిని ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం నెరవేరలేదు.

  1. జీఓఎమ్ఎస్ నెం. 1 (తేది 2016 జనవరి 02) ద్వారా ఏర్పాటు చేయబడింది
  2. జీఓఆర్టి నెం. 2780 (తేదీ 2015 నవంబరు 13) ద్వారా ఏర్పాటు చేయబడింది

పేజీ 4