పుట:2016-17 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై సిఎజి నివేదిక.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

2017 మార్చితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదిక

పట్టిక 1.2: 2016-17 సంవత్సరానికి రాబడులు-చెల్లింపుల సంక్షిప్త వివరాలు



గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వివిధ అంశాలలో క్రమమైన హెచ్చు/తగ్గులను గమనించడమైంది. వాటిని ఈ దిగువ పేర్కొనడమైంది:

రెవెన్యూ రాబడులు

  • 11.66 శాతం మేరకు పెరిగాయి
  • సొంత పన్ను రాబడి 10.71 శాతం మేరకు పెరిగాయి
  • భారత ప్రభుత్వం నుండి గ్రాంటులు 6.47 శాతం మేరకు పెరిగాయి

రెవెన్యూ ఖర్చు

  • 21.12 శాతం మేరకు పెరిగింది
  • ప్రణాళికా వ్యయం 13.90 శాతం మేరకు పెరిగింది
  • ప్రణాళికేతర వ్యయం 24.71 శాతం మేరకు పెరిగింది

క్యాపిటల్ పరిచ్యయం

  • 6.86 శాతం మేరకు పెరిగింది.

లోన్లు, అడ్వాన్సులు

  • రికవరీలు 611.93 శాతం మేరకు పెరిగాయి
  • చెల్లింపులు 16.32 శాతం మేరకు తగ్గాయి.

ప్రజా రుణం

  • రాబడులు 11.63 శాతం మేరకు పెరిగాయి
  • రీపేమెంటులు 9.54 శాతం మేరకు తగ్గాయి

నగదు నిల్వ

  • 21,48 శాతం మేరకు పెరిగింది

2016-17 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ లోటు 17,231[1] కోట్లు. ఈ ఏడాది ద్రవ్య లోటు (30,908 కోట్లు) జీఎస్డీపీలో 4.42 శాతం ఉంది. ఇది 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి 3.25 శాతం కన్నా ఎక్కువగా ఉంది.

  1. ఉజ్వల్ డిస్కమ్స్ యోజన (యూడీఏవై) పథకం కింది 18,256 కోట్లను కలుపుకొని

పేజీ 2