పుట:2016-17 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై సిఎజి నివేదిక.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం 1

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు


ఆంధ్రప్రదేశ్ స్వరూపం

ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం పరంగా 1.63 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భారత దేశంలోని రాష్ట్రాల నడుమ ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా దేశ మొత్తం జనాభాలో 4.10 శాతాన్ని కలిగి పదవ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సామాజిక-ఆర్ధిక సూచికలను ఆనుబంధం 1.1లోచూపడమైంది. రాష్ట్ర స్థూల గృహోత్పత్తి (జీఎస్డీపీ) అధికారికంగా గుర్తింపు పొంది, నిర్ధారిత కాలంలో రాష్ట్రంలో ఉత్పత్తయిన తుది వస్తు-సేవల మార్కెట్లు విలువను జీఎస్డీపీగా వ్యవహిస్తారు. రాష్ట్ర జీఎస్డీపీలో వృద్ధి రాష్ట్ర ఆర్థిక స్థితికి సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్థిక సూచిక అవుతుంది. ప్రస్తుత ధరల్లో భారత దేశ జీడీపీ, రాష్ట్ర జీఎస్డీపీల వార్షిక వృద్ధి వివరాలు పట్టిక 1.1లో ఇవ్వడమైంది.

పట్టిక 1.1: దేశ జీడీపీ, రాష్ట్ర జీఎస్డీపీల తులనాత్మక వివరాలు
సంవత్సరం 2012-13 2013-14 2014-15 2015-16 2016-17
భారత దేశ జీడీపీ (కోట్లలో) 99,44,013 1,12,33,522 1,24,45,128 1,36,82,035 1,51,83,709
జీడీపీ వృద్ధిరేటు (శాతం) 13.82 12.9 10.7 9.9 10.98
రాష్ట్ర జీఎస్డీపీ (కోట్లలో) 4,11,404 4,64,272 5,26,468 6,09,934 6,99,307
జీఎస్డీపీ వృద్ధిరేటు (శాతం) 8.43 12.8 13.40 15.8 14.65

మూలం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక-గణాంకాల నిర్దేశకుల, కేంద్రీయ గణాంకాల కార్యాలయాలు. జీడీపీ, జీఎస్టీపీల అంచనాలు 2011-12 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని లెక్కించిన కొత్త శ్రేణిలోనీవీ.


1.1 పరిచయం

2016-17 సంవత్సరానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను స్థూలంగా ఈ అధ్యాయంలో విపులీకరించడమైంది. గత సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన ద్రవ్య రాశుల విషయంలో చోటుచేసుకున్న కీలక మార్పులను విశ్లేషించడమైంది. ఆర్థిక పద్దులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. ప్రభుత్వ పద్దుల కూర్పు-ఆర్థిక పద్దుల్లోని స్వరూప చిత్రణ అనుబంధం 1.2లో ఇవ్వడమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014 జూన్ 02 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విభజించారు. 2013-14 వరకూ రాబడులు, ఖర్చులూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి, 2014-15లో 2014 ఏప్రిల్ 1 నుండి 2014 జూన్ 01 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వివరాలు కలిసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఐదు సంవత్సరాలకు సంబంధించిన సరళిని విశ్లేషించలేము కనుక, గత ఆర్థిక సంవత్సరం (2015-16)తో మాత్రమే పోల్చి, ఆడిట్ తన వ్యాఖ్యలను పరిమితం చేసింది.

1.2 ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక లావాదేవీల సంక్షిప్త వివరణ

ప్రస్తుత సంవత్సరం, గత ఏడాదికి సంబంధించి రాష్ట్రప్రభుత్వ ఆర్థిక లావాదేవీల సంక్షిప్త వివరాలు పట్టిక 1.2లోనూ, 2016-17లో రాబడులు-చెల్లింపుల వివరాలు, సమగ్ర ఆర్థిక స్థితి అనుబంధం 1.3లోనూ చూపటమైంది.