పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/97

ఈ పుటను అచ్చుదిద్దలేదు

88

క చ్చ పీ శ్రు తు లు

అన్నదమ్ముల గని పెన్నిధులని కూల్మి
        లెక్కించు నక్కచెల్లెండ్రు నీవు
నాయమ్మ నాయయ్య నాకన్నవారని
        గొబ్బున ప్రేమించు కూతునీవు
ప్రాణంబు లన్నియు భర్త కర్పించి యి
        ల్మర్యాద కాపాడు భార్య నీవు
   కార్యహేతువు నీవు, జగమ్ము నీవు
   నీవె యంతయు, నెద్దియుం గాచ్వు నీవు
   నీదు తత్వంబు దెలిసి వర్ణీంపదరమే
   యాశ్రితజనార్తిభర్గ : మాయమ్మదుర్గ

44. పుంసాం మోహనరూప:

సీ॥మొకరితుమ్మెదల నార్బోసిన యట్టులు
          ముంగురు ల్నొసటిపై ముద్దులూర
    తెలిదమ్మిరేకుల దెగడు నాల్గందోయీ
          నెమ్మియు నోరువు నెనరు దెలుప
    పలుదాలు మల్లెమొగ్గలు, చివుర్వాతెర,
          కార్బొంపము బనిరిగడ్డ మమర
    కుంచ్పుమొదలటు గొప్పమెడయు బెద్ద
           తలుపువలె న్రొమ్ము తనరుచుండ
       భళిర: ముంగాళ్ళ చాటు చేతులున్ మరియు
       నడుము పిడికిల నిముడ్కుకుందనవు బాయ
       యొడలు తిన్నని యేరానియొడ్డు పొడవు
       ఆడ్చేమితనిని మగవాడె వలచు

సీ॥ కలదున్న పున్నమ చందురు గాచంటి
           మో నీని మోమున కునమ యేది