పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/81

ఈ పుటను అచ్చుదిద్దలేదు

17

క చ్చ పీ శ్రు తు లు

దీపమాఱినయట్లు తెవ్వి శూన్యంబగు
      దేహాంతములయందు దెల్లముగను
  మనకు గగనారవింద వరనము లేల
  యిహమునందున స్వమతాభివృద్ది మీఱ
  నెల్ల రన్యోన్యమైత్రికి హేతువైన
  ధర్మవర్తన మెపుడైన దప్పజనదు.

గీ॥చెలగి తలిదండ్రుల యభీష్టములను దీర్చు
    పుత్రులకు నిశ్చయంబుగ బొందరాని
    పదచ్వులుండెనె ధరణిలోపల సమస్త
    జనులకుం బితృభక్తి రసాయనంబు.

గీ॥ చెల్లునని పెద్దలమని తోచిన విధమున
     తెలగి సంసారులకు బాధ సలుపరాదు
     నీతిమాలిన యపుడు మన్నింపదగదు
     గురువులనైన మరెట్టి భూసురులనైన

గీ॥ తమకు లాభ మెదియు పోయ కెంతయు
     బరులకొఱకు పాటుపడుచునున్న
     పిన్నవారికైన బెద్దలకైనను
     మంచిచెడ్డ దెలుప మనసె సాక్షి.

22.భవనిరాసము:



సీ॥ తల్లిగర్భమునం దొదవినట్టి కష్టము,
              పొత్తిళ్ల లోపల బొరలుబాధ