పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/66

ఈ పుటను అచ్చుదిద్దలేదు
దా స భా ర తి
2.కృత్తి:

సీ॥ అభ్రంలిహాదభ్ర విభ్రమభ్ర భ్రమ
          కృన్నీల దీర్ఘ శరీరమమర
     బ్రళయకాలానల ప్రభను జక్రికృతే
          క్షణముల రౌద్ర మక్షయముగాగ
     ద్రైలోక్యకబళనోత్సాహ సూచకఘన
          వక్త్రత్రయోగ్రత వాసికెక్క
     బర్పు బర్పరకేశ పాశారుణప్రభా
          కాల సంధ్యరాగ కాంతదనర

     గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
     బదయుగోద్దూత పాంసువు ల్పదలుగప్ప
     నేలబదముల నింగిని నిడ్గతలల
     న త్తిగొనివచ్చె గృత్తి తా మత్తి పగిది.

గజేంద్ర మోక్షణము

3.సంప్రార్ధనము:

     గీ॥ అన్నిటికి దుద మొదలయి యున్నవాడ :
          పలు తఱంగుల నొకడనై భరగువాడ :
          దొరికి దొరకని యట్టుల దిరుగువాడ :
          నేను నీవాడజుమ్ము నాలోనివాడ :

గీ॥ కోరికల కడ్దుదగిలెడు వారిలోన
      గొప్పవాడవుగాన నిన్నొల్వవలనె