పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/49

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తోనే గాక క్లిష్ట ప్రాసతోను నడిపించిల్రి. భీముని క్రోధాతిరేకము నోకచో తిక్కనగారు - "నేలయు నింగియు దేఅశముల్ గా జేసి, యేపునరేగి వాయించియాత" అని సీవనమును సమాస రహితముగను చిత్రించి యందు జీవకళ పొదిగిరి. దాసుగారును తాదృశానేక సందర్భములందు సీసమునకు వన్నె దెచ్చిరి.

చూ. 1.నరసింహావిర్భావము (15):-
          సీ॥ గంభీర భీకర గర్జారవంబున
                   బ్రహ్మాండ భాండ కర్పరము పగుల

      2.నక్రవిక్రమము (పరిశిష్టము-పుట 2):-
           సీ॥ భూరి భూత్కార సంధూత గంభీర గుం
                      భద్వానమున శైలపంక్తి నడక...

అయితే యిందు సమాసములును, శబ్ధాలంకారములును గలవు. అట్లు లేకుండగను ఆ సందర్భములకు సీసము నియోగించ వచ్చునని నిరూపించిరి.

చూ.1.భీష్మ ప్రతిజ్ఞ (పరిశిష్టము-పుట 8)"-
         సీ॥రాలనీ చుక్కలు, కూలనీ కులగిరు,
                 లిల గ్రుంకనీ, వార్ధు లింకిపోని
             ఆకస్మికముగ సూర్యారంద్రముల్ గతుల్
                 దప్పనీ, జగమెల్ల తల్లడిలని...

   2.భీష్మ సంగ్రామము (పరిశిష్తము-పుట 7):-
          సీ॥ విరిగెడు నరదము లొరిగెడు గుఱ్ఱముల్,
                     తెగిపడు సిడములు, త్రెళ్లు కరులు...

ఇట చందమునకును శైలికిని గల మధుర భాంధవమును దర్శించగలము. ఫలాని సందర్భమునకు ఫలాని చంద మను నియమము సామాన్యకవులకు, విదగ్ధ లే సందర్భమున ఏ చందం నెత్తుకొన్నను తమ శైలీ ప్రాగల్బ్యముతొ దానికి మొలాము వేయుదురు.

          "ముందటి దినములలోపల । కందమునకు సోమయాజి ఘను డందురు". శ్రీనాధుని సీస మందురు. నన్నయ మత్తేభ మందురు. వేమన ఆటవలది యందురు. ఆదిభట్ల వారి వేమనవలెనో నాకు బోధపడలేదు.