పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/46

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దెడనెడ లెస్సు, రెప్లెక్టరు మున్నగు ఆంగ్ల శబ్దములను వాడుటకును వెనుదీయలేదు. మిగిలిన అన్యదేశ్యములు సరేసరి, వానికి కొంత వినియోగ మెక్కువ, పీఠికాపురవర్ణన మొక చతుర్భాషాసీసమున వ్రాసిరి (పుట 44-45, సంస్కృతము, పారశీకము, ఆంగ్లము, తెలుగు) వారు అరబ్బీ పర్షియను భాషలందును మహా పండితులు. ఉమరుఖైయాము రుబాయతును పారశీక మూలమునుంది అనువదించిరి. ఆంధ్రీకరణము, సంస్కృతీ కరణము ప్రత్యేకముగా జేసిరి. సంస్కృతమున తారకమను నొక కావ్యమును, శ్రీహరికధామృత మను పేర మూడు హరికధలను, రామచంద్ర, కాశీ శతకములను రచించియుండిరి, అచ్చటచ్చట సంస్క్ఫ్ఘతమునకు కొంత తెలుగు వాలకము వైచినను వైయాకరణైక వేద్యములైన ప్రౌఢ ప్రయోగములు చేసి ప్రాచ్య పాశ్చాత్య పండిత ప్రకాండుల ప్రశంసల నందుకొనిరి. ఇందలి "సంస్కృత సారణి" యందు కొన్ని మచ్చు తుమకములను జూడదగును. ఆంగ్లమున మహావిద్వాంసుడీయన. తన 24 వ యేటినుండియే షేక్సిపియరు అనువారమునకు పూనుకొనినట్లు స్వీయారిత్రలో చెప్పిరి. అనేక హరికధలలో ఆలవోకగా ఆశువుగా సభ్యుల అభ్యర్ధన మీదను, స్వయముగను షేక్సిపియరు ప్రభృతుల పద్యముల ననువదించుట వీరికొక పరిపాటిగ నుండినట్లు నేటి వార్తా పత్రికల వలన తెలిసికొంటిని. ఆంగ్లమున చిన్నచిన్న గ్రంధపీఠికలు, సంస్కృత శ్లోకానువాదములు తప్ప వేరే రచన లెవ్వియు నున్నట్లు తెలియవచ్చుటలేదు. ఏ భాషయందు రచన చేసినను మృదు మధురముగ హపణించుట వీరి తీరు. "కృతిని నిఘంటువు వెతికి ముదురు తాటి: ముంజెవలెన్ జేయు" మూర్ఖులను "ప్రౌడకల్ప లని పన్ని తనకుదానె యుద్ధం బెఱుగలేని వ్యర్ధులను "తేట తెల్లంబని తెన్గు భాసకు బట్ట ; తెరరి చూపించెడి" దేబెలను ఎలుగెత్తి గర్హించిరి.

చందస్సౌందర్యము:
    ప్రపంచమున సర్వేసర్వత్ర కవిత్వము చందోమయ భారతి నాశ్రయించియే ఆవిష్కృతమైనంది. చందమే కవితకదుగాని, అది దీని బహిరాకృతియేగాని దానికిని దీనికిని గల అనుబంధ మతి సనాతనము, సహజము, సమీచీనము, సమంజసము నైనది. చందస్సు కవితయొక్క బహిరాకృతి మాత్రమే కాదు. ఒక్కొక్కపుడు దాని
  • తెలుగు భాషగురించి దాసుగారి కున్న అవగాహన మద్భుతమైనది. తత్పరిశీల నార్ధము వారి "సీమపల్కునహి" పీఠికను, వ్యాసపీఠికను జూడతగును.