పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/45

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవ్చి అర్జునుడు కృష్ణుని తనకు సందేహనివృత్తి అచ్చతెలుగులో సేయమని అడిగనట ! ఆహా దాసుగారి మమకారము !

    "అన బిన్న నవ్వున ననె నల్లవేల్పు--
    కడముట్టె వెఱ్ఱి రోకలి దల జుట్టు
    మనునట్టు లడిగెరో యబ్బాయి: నీకు
    జెవి పట్టలేదు నా చెప్పిన మాట
    మఱువకు సరిగ నీమది నుల్పుకొనుము
    కోరికె తప్ప నీకు బగవా డేవండు ?
    నీరూపు కోరిక, నీకు నీ వెదిరి
    అర్ధముగను పిచ్చుకలు తమకమున
    నీ నీడతొడనే నీవు పొరెదవు."
 

ఇందులో అచ్చతెలుగు నానికేగారు చచ్చు తెలుగువానికి అర్ధముగాని మాట యే యున్నది ? మరియొక చిత్రము అవసరము పడి యొక్కకోవకు చెందిన పలుకు లెత్తుకొనిరా పట్టిక లేకరువు పెట్టగల దిట్ట ఆయన.

ఉదా॥ సీ. కుడియడ్గు, సర్వడి, కుమ్మరింపు, వనము,
                  చాంగణ, రాశియు, చలికి, చేట...
ఇట్లు పద్యమంతటా నలుబది మల్లబంధ విశేషములను పేర్కొనిరి.
          సీ. ఈ వెఱ్ఱిపాఱు, డీ యెంబన్న, ముసలి, యం
                    బేధ, పిసాళి, యవిటి, చెవంటి...

ఇట్లు నాల్గు పాదముల నిటువంతి యోగ్యతా వాచకములను ముప్పదింటిని పేర్కొనిరి. ఎంత బరువైన భావమునైన అనాయాసముగ వ్యక్తముచేయ శక్తి తమకును తమ తెనుగునకును ఉన్నవారిలో ఎన్నికైనవారు తిక్కనయు నీయనయు. తెలుగు జాతీయములు లోకోక్తులు గప్పించుట యందును ఇద్దరును సిద్ధహస్తులు. అంతేకక వీరిరువురు సంస్కృత ప్రచురముగా సమానగుంభన గంభీరముగా రచన చేయజాలియు "చెల్లియుండియు పైరణ చేయ నతడు" అన్నట్లుగా తెలుగు దనమును వలచినవారు. వీరి మిశ్రభాషా పద్యము లందును తెలుగు పాలే అధికము*. దాసుగారు 'నవరసతరంగిణి ' యందు షేక్సిపియరును మిశ్రభాషయం దనువదించిరి. కాళి దాసును అచ్చతెనుగు జేసిరి. అది వారి నియమము. భాషాంతరెకరణమున మాతృకాభాషా శ్సబ్దములు దొరలిన అది యనువాద మెట్లగునని వారి వృచ్చ. వారు చాటువులం