పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/33

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంచుమించుగ దాసుగరి ప్రతిపద్యము చదువరి పెండ్లికొడుకునకు సాలంకార కన్యాదానమే. అందలంకారముల వైవిధ్యము గలదుగాని దాసుగా రుపమకు తాళిగట్టిరి. అది యొక శైలూషి యని అప్పయదీక్షితులవారు సెలవిచ్చిరి. దాసుగారు దానిచేత వేయించిన వాలకములు ఆడించిన ఆటలు చూచినచో చట్టున కాళిదాసు జ్ఞప్తికి తగిలినను అతడు తెలుగువాడు కాడులేఅని యటుంచి- "ఉపమా ఆదిభట్టవ్వ" అన్నదేమాట అని యనుకొందుము. ప్రతి యూరకవియు నుపమలు వాడు వాడేకదా మరి యీతనిదేమి ప్రత్యేకత ! అనిపించును. పదిమంది దిస్టి తగిలిన పడుచుపిల్ల యొక్కనితో కన్ను గిలిపిన దన్నచో అది వాని యొక్కటి యోగ్యతకాదా మరి. అసలీ యుపమ అలంకార ప్రపంచమున పరమ ప్రాచీనమైనది. ఋగ్వేదమునందును దానికిరూఢమూలమైన స్థితియున్నది. ఆదికవి కడ సాష్ఠాంగపడిన దామె. భరతాచార్యుని పరిగణనము నందును దానిదే అగ్రతాంబూలము. అంతేగాక అప్పయదీక్షితుల వారి వక్కణ ప్రకార మది సర్వాలంకార బీఱభూతమైనది. అందుచేతనే అలంకారములలో దానికంత ప్రాముఖ్యము. తద్విన్యాసమున నిరుపమానమైన నిపుణతాప్రద ర్శించు శక్తి సిద్దించుటకు కాళీదాసత్వమే నిమిత్తము కానక్కరలేదు నారాయణదాసత్వము వలనను అది సిద్దింపగలదు. నిపుణతతో బాటు దాసవాజ్మయమున ఉపమధిక ప్రాచుర్యమును గలదు.

ఉదా|| 1. భగవంతునికొలత (పుట21):
               సీ. వలయరేఖకు బోలెవశమె తెల్పంగనీ
                        కారి మధ్యాంతము లప్రమేయ !
                   ఎల్ల జగంబులకీవె యాచారము
                        లెక్కల కన్నింటి కొక్కటి వలె
                   పెరుగవు తరుగవు విభజింపబడవు శూ
                       న్యాంకము వలె నకలంకచరిత!

ఏవంవిధ గణితోపమాన మపూర్వము. ఆ యువనులకు దగినట్లా సంబుద్ధులు సాభిప్రాయములు.

       2.కుంభకర్ణుడు(పుట 28)
               సీ.సంజకెంజాయచే నంజనాచల మలు
                   కావి దు స్తుల నీలకాయ మమర