పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/32

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌందర్య దర్శనమున- "కుండ్రని చెక్కిలిపై జీఱునొక్కు సొగసు"ను వారు మరచిపోలేదుగాని యింకొక సొగసైన లక్షణమును దర్శించిరి.

       "కొప్పు నిలువబడి విప్పినన్ నీలి గా
             జుల మలారము పోల్కి తెలగు నేల"
                           -------

తరుణికి తలిదండ్రులు పెట్టని సొమ్ము, ధమిల్లము, రసిక పురుషుని చప్పున నాకర్షించు రమణీమణి యాస్తితో నదియొక ముఖ్యాంశము. అందులకే "కేశసంపద" యని దానికొక పెద్దపేరు. మదనాయుధ పూజామందిర్ మది. కామినీ కాముకుల రతి కొతుకము పరాకాష్ట నందినప్పుడు పరస్పర కేశస్పర్శ సౌఖ్యానుభవ మొక సంభోగరహస్యము. అందుచే కలరీ ప్రశంస లేక కాంతావర్ణన మనర్యాప్త మగును. ఈ రసజగద్రహన్యము లెవ్వియు దాసుగారికి తెలియనివి కావు. అందును విప్పిన కొప్పునకు వారి నెలిగాజుల మలారము పోలిక అశ్రుపూర్వము. రాముని చూడ్కుల చెలిమి దోడ్కొని యేగు రేటవాలగు ఆమె రూపు లిరుల వీచుచున్నవట! అనగా నీలమేఘశ్యాము డగు నతని నా చూపులు సర్వాంగీలు పరిష్వంగము చేసి మందాక్ష్మదురోహాదోహలము లైన వని వ్యంగ్యము. (చూ.పుటలు 11,12) ఆ సీతారాముల పరముగా వర్ణితములైన నవవధూవర చేష్టలలో గలినింబృతి యెల్లగ ఉల్లమునుండి పెల్లుబుకుతున్న వల్ల మాలిన మక్కువ చిత్రింపబడిన వైనము మనోజ్ఞము (పుట.26). దాసుగారు తమ మిత్రులు సోమంచి భీమశంకరంగారి శృంగార సంగీతము నతి చమత్కారముగా నాలపించిరి. ()51-52) ఆ పద్యములేడును నొక మధుర హృదయ విపంచికపై పలికిన మహితాను రాగ శుభశ్రుతులు. శంకరంగారి వలపుకత్తె వక్షోజములకు తమ భారమును భరించు నడుముపై నుకంపమాని దాని ప్రకంపనమునకు కారణభూతములైనవట. శంకరంగా రూర కొందురా? తగినశాస్తిచేసిరి. వానికి సలక్షత దంతక్షత మర్దనాధిక వివిధ్ శిక్షలు వేసిరి. ఇట్టి వర్ణనలు చేసిన దాసుగారు మాత్రము తమ ప్రాయపు స్రాహ్ణమున అట్టి పారువత్తెము లమలు జరిపి యుండరా!

అలంకారసంపద:
   మామూలు మాటయొక్క కవితాజగత్ప్రవేశమునకు కవాటము నొనరించుల్నది అలంకారం. అయితే ఆ అలంకారము రసోనస్కారకము, ప్రకృతార్ధసుబోధికము. చమత్కారజనకము అయితేనేగాని కవితాసరస్వతి దానిని పూర్తిగా కటాక్షించదు.