పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/30

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌందర్య దర్శనమున- 'కుండ్రని చెక్కిలిపై జెలునొక్కు సొగసును వారు మరచిపోలేదుగాని యింకొక సొగసైన లక్షణమును దర్శించిరి.

               "కొప్పు నిలువబడి విప్పినన్ నీలి గా
                     జాల మతారము పోల్కి తెలగు నేల"
                            -----------------

కరుణికి తలిదండ్రులు పెట్టని సొమ్ము, దమ్మిల్లము, రసిక పురుషుని చపున నాకర్షించు రమణీమణి యాస్తిలో నదియొక ముఖ్యాంశము. అందులకే "కేశసంపద" యని దానికొక పెద్దపేరు. మదనాయుధ పూరామందిర మది. కమినీ కాముకుల రతి కౌతుకము పరాకాష్ట నందినప్పుడు పరస్పర కేశస్పర్శ సౌఖ్యానుభవ మొక సంభోగ రహస్యము. అందుచే కబరీ ప్రశంస లేక కాంతవర్ణన మనర్యాప్త మగును. ఈ రసజగద్రహాస్యము లెవ్వియు దాసుగారికి తెలియనివి కావు. అందును విప్పిన కొప్పునకు వారి నీలిగాజుల మలారము పోలిక అశ్రుతపూర్ఫము. రాముని చూడ్కుల చెలిమి దోడ్కొని యేగు చేటనలగు ' ఆమె చూపు లురుల నీనుచున్నవట! అనగా నీలమేఘశ్యామ డగు నతని నా చూపులు సర్వాంగీణ పరిష్వంగము చేసి మందాక్ష మధురొహోదోహలము లైన వని వ్యంగ్యము. (చూ.పుట్లు. 11,12), ఆ సీతారాముల పరముగా వర్ణితములైన నవవధూవర చేష్జలతొ గబ్బిసిబ్బితి యెల్లగ ఉల్లమునుండి పెల్లుబుకుచున్న వల్లమాలిన మక్కువ చిత్రింపబడిన వైనము మనోజ్ఞము (పుట. 26) దాసుగారు తమ మిత్రులు సోమంచి భీమశంకరంగారి శృంగార సంగీతము నతి చమత్కారముగా నాలపించిరి. (51-52)ఆ పద్యము లేడును నొక మధుర హృదయ విపంచికపై పలికిన మహిరాను రాగ శుభశ్రుతులు. శంకరంగారి వలపుకత్తె వక్షోజములట తమ భారమును భరించు నడుముపై అనుకంపమాని దాని ప్రకంపమునకు కారణభూతములైనవట, శంకరంగారూర కొందురా? తగిన శాస్తి చేసిరి. వానికి నలక్షత దంతక్షత మర్ధనాదిక వివిధ శిక్షలు వేసిరి. ఇట్టి వర్ణనలు చేసిన దాసుగారు మాత్రము తమ ప్రాయపు ప్రాహ్ణమున అట్టి పారువత్తెము లమలు జరిపి యుండరా!

 అలంకారసంపద:
     మామూలు మాటయొక్క కవితాంగత్ర్సవేశమునకు కవాటము నొనరించునది అలంకారము. అయితే ఆ అలంకారము రసోసస్కారకం, ప్రకృతార్ధమబోదకము, ప్రకృతార్ధసుబోధకము. చమత్కారజనకము అయితేనేగాని కవితాసరస్వతి దానిని పూర్తిగా కటాక్షించదు.