పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/29

ఈ పుటను అచ్చుదిద్దలేదు

యనుభవముండవలె. మైసూరు పురవర్ణన మొక సంస్కృత దండకమున కందగల సమాసములతో కడు చక్కగా సాగినది.

   8.సౌందర్యము, అనురాగము, వాని ఆత్మబంధువు శృంగారరసము - ఈ మూటికిని దగ్గరి చుట్టము  దాసుగారి హృదయము, అనుభవసిద్ధులైన రసుకులు వారు, "శృంగార సర్వజ్ఞ" సార్ధక బిరుద ప్రతిగ్రహీతలు, ఆ విషయములందు వారి చూపు డేగచూపు పలుకు పావురా పలుకు. జగన్మోహినీ సౌందర్య ప్రస్తనమును (పుట 19) తానుగా జేసినప్పుడాయన ప్రకటించిన అభిరుచి యెట్టిదో పరికింపుడు. "చిరుగుంట కల్గినచెక్కిలి", 'ముక్కు ప్రక్క మొదలు మోని మూలవఱకు పోల్చాడు వంక ', 'హోయలుగ బల్పాలు నొకవంక గనుపర్చు విన్న నవ్వు ', 'పడుమ జక్కని నొక్కు తొడరిన గడ్డము పొలుపు ' - అనీ ఆయన కించునట్టి సోయగౌ వాయనముల, ఆయభిరుచి జీవితమున బహువారములు బహుర్ంగుల సుందర ముఖారవిందములను బహిరంగముగా చూచుట మత్రగాదు అంతరంగపు మెత్తని పొత్తిళ్లలో భావన చేసిన రసిక రాధికా ప్రియునిది గాని సామాన్యునిది గాదు. జగన్మోహినితొ శివుని పలుకులుగా నున్న సీసపధ్యమున (వరిశిష్టము -) వారిరువురికి చెలువమున గల పోలిక చమత్కార చారువుగా నిరూపింప బడినది. అంతేకాదు. జగన్మోహినీ సంబుద్ధులు నాల్గుపాదాంతము లందును - సారంగ గమన, సారంగ నయన, సారంగచికుర, సారంగ పాణి అని యున్నవి. ఆయన యెట్లును సారంగధరుడు గదా, అంత సారంగోపమ యైన యామెతో- 'నీవు నాకు దక్కుటయే యుచిత" మని శివును భావన వ్యజ్యమాన మగుచున్నది. సావిత్రీచరిత్రమున సత్యవంతుని సౌందర్యము "పుంసాం మోహన రూప:" అను తీరున మనోహరముగ వర్ణిటము (కచ్చపి పుట 33,34), సావిత్రీ సత్యవంతులకు తొలిచూపులొ వలపు తొలకరించిన విధము మనోజ్ఞ వర్ణనావసరము:

            "సలలిత పాదాంబుజాతంబు లందున
                 గొదమ తుమ్మెద కనగూడునట్లు
             బాసుర నిమ్ననాభీ సరోవరమున
                 గండు బేడిన జోడు కలియు భంగి...."

ఇత్యాదిగ సాగిన వర్ణనమున వారి ఆపాదమస్తక పరస్పరాకర్షణ చిత్రణము కవి సమయ కలితముగ క్రమనవిద్ధముగ అలంకార చతురస్రముగ నున్నది. సీతా