పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/213

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

కిది మిక్కిలి ప్రీతిపాత్రమైనగ తోచును. వారు దీనిని దేవభాషలో వ్రాయుట తొలుగ 1930 లో విజనగర శ్రీ వేదవ్యాస ప్రెస్సులో తెలుగు లిపిలో ముద్రిందినను, పిదప 1939 లో మదరాసు వావిళ్ళ ప్రెస్సున నాగరి లిపిలో వేయింఛుట చూడ సర్వదేశస్థులును దీనిని చదివి కృతార్ధులు కావలెనని వారి యాశయము మనిపించును. అమపద హృదయంగమ మైన రచన. సంస్కృత భాషమును, చందస్సందర్బాది కావ్య మర్యాదలకును కొంత చక్కటి తెలుగు వాలకము వైచిరి (1921 లో విజయనగరము S.V.V. Press లో అచ్చ యిన దాసుగారి సారంగధర నాటకము చివదైన 124 వ పుటలో "ముద్రితము లగుచున్న మద్విరచిత గ్రంధములు" అను శీర్షిక క్రిందనున్న పట్టికలో తొలు దొల్త కాళీయమర్ధనము, కంసవధ, పారిజాతాపహరణము అను మూడును సంస్కృత హరికధ అని ఉటంకించబడియున్నది. ఆ పేరిట కృతులు వేరే లభింపకపోవుటవలన వరుసగా నీ మూడే హరికధామృత సంపుటిలోని కద లగునేమో యని అనుమానింపవలసి వచ్చుచున్నది. కాని ఆ 'సారంగధర 'వెనుకటి యట్టపై 'మద్విరచిత ముద్రిత గ్రంధముల" పట్టికలో సంస్కృత శ్రీకృష్ణజననము పేర్కొనబడియుండుటచే మీది యూహ యెంతపట్టు సత్యసన్నిహిత మగునో చెప్పలేము)