పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/209

ఈ పుటను అచ్చుదిద్దలేదు

24

దా స భా ర తి

2. నవరస తరంగిణి : కవితలో విశ్వమును, విశ్వములో కవితను దర్శించి తమ కావ్య నాటకములం దొక రసజగత్తును ప్రగల్పింపజేసిన లోకైక మహా కవులు షేక్సిపియరు కాళిదాసు లెట్లాయా నవరసములను పొషించిరో వైనము వారిగా పటిష్ట ప్రణాళికముగ్సా నిరూపింపబడిన బృహద్గ్రంధము. ఇందా మహా కవుల సర్వ కావ్య నాటకములందలి ప్రముఖ ప్రముఖ పద్యములు, ప్రసిద్ద పంక్తులన్నియు వచ్చినవి. ఆ మూల పంక్తులన్నియు వివిధ రస శీర్షికల క్రింద వింగడింపబడి యెదురుగా తదనువాద మెక్కువగా పద్యములలోను ఎడనెడ వచనములోను చూపబడినది. ఆంగ్లమున కనువాదము మిశ్రభాషయందును, సంస్కృత ప్రాకృతముల కనువాదము అచ్చ తెలుగు నందును సాగినది. ఒక భాష ననుసరించి పట్టున ఆ భాషయొక్క పద మొక్కటైన అందు పడగూడదని దాసుగరి నియమము. అనువాద మెప్పుడును. "అహో మూలచ్చేదీ తన పాండిత్య" మను నట్లుండరాదు. మూలపంక్తి పరమర్ధమును కరబదర మొనర్చవలెగాని దానిని మించిన కఠిన పాకమున బడరాదు. తాతకు దగ్గులు నేర్పవలెనా? దాసుగారికి తెలియనివి కానీ సులువులు, వివిధ మూలపంక్తుల సంగ్రహము, అనువాదము నందలి కఠినశబ్దముల కర్ధములును గలవు. వీనియన్నిటికిని మకుటాయమానముగ విపులమైన పీఠిక గలదు. అం దిత:పూర్వ మెవ్వరును గుర్తించని ఆ మహాకవుల లోతుపాటులను విమర్శించుటకు వెనుకాడలేదు సర్వతంత్ర స్వతంత్రుడైన దాసుగారు. ఆంధ్రసాహిత్య సరస్వతి కొక అమూల్యాభరణ మీ గ్రంధము. ఇది యొక క్షోధక్షమమమైన పరిశ్రమ ఫలితము. విజయనగర ప్రభువు శ్రీ అలకనారాయణ గజపతుల కంకితము.

ముద్రణ: విజయరామ విలాస (రాజప్రాసాద) ముద్రణాలయము- విజయనగరము - 1922 (దీనికి యొక్కటే ముద్రణ మిప్పటికి వచ్చినది. ఆ ప్రతులు 500 మాత్రమే. నేడు ప్రతి మిక్కిలి దుర్లభము. అవశ్య్హము పునర్ముద్రణ చేయవలసిన గ్రంధము)