పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/206

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

ర్ద్యమునను సజీవ పాత్రనిర్మాణ చాకచక్యమునను బందుర భావసంపద వలనను సరళరచనా రామణీయకమునను, కవితాకళకు కేశాకులైన పద్యముల తోడను, సంగీత బంగీ తరంగితములగు పాటలతోడను పాఠ్యేనాట్యేచ మధురముగ రాణించు నాటకరాజము. రచన: 1890. ముద్రణ: శ్రీ వేదవ్యాస ప్రెస్, విజయనగరము.1921.

గద్య కృతులు

1. జగజ్యోతి: 'అష్టాదశ విద్యా ప్రకాశిక ' యని దీని వామాంతరము. ఇది నారాయణదాస విజ్ఞాన భాండాగారము. దోరవయసునందే దొడ్డ హృదయము గల దాసుగారు వయ: పరిపాకంతోపాటు మరింత పరిపక్వమైన హృదయముతొను, అసమాన పాండిత్యమును, చరిత్రమును అందును ఈ గ్రందమును పరిశీలించినచో ఒక జన్మకాలమున నొక మానవ మాత్రునకిన్ని విద్య లింత యలవడునా యని అక్కజము మిక్కటము గాకమానదు. అందును ఈయన హరిదస జగద్గురువే కాని యీయన కొక్క విద్య యందును నొక గురువనుచు లేదాయె. లౌకిక గురువుల నాశ్రయించినవారొండు రెందు విద్యలు దొజ్జ లగుటయే అపూర్వము. కాని జగజ్జగదీశులనే పరమ గురువులుగా పరిగణించిన వీరి కీ విద్య లలవడుట యేమి అపూర్వము? దాసుగారు గ్రందాదిని ఇష్టదైవత ప్రార్ధనమున 'ద్వాదశాత్మా '! జగజ్జ్యోతీ! ప్రభాకరా! అని సంభోదించిరి. నంవిత్తుకు ప్రకాశము సంకేతము. దానిని దాసుగా రే పవితృదేవతాక మంత్రోపాసన వలననో సముపార్జించి లోకసంగ్రహార్ధము ఆ వెలుగు నీ గ్రందరూపమున వెలయించి చరితార్ధులైరి. మిశ్ర భాషలో చతురస్వము, అనవద్యము నైన గద్య రచన. ఇందు దాసుగారి సాధుమేధా సహస్రారధార కించిదూనన సహస్ర పుట సంపుటముగా బాహిరిల్లినది. రచన ; 1939-43 ప్రచురణ; ఆ. నా. దాస అముద్రిత గ్రంధ ప్రచురణ సంఘము, విజయనగరము. సంపుటము 1 - 1959, II - 1960