పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/199

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

11. రుక్మిణికల్యాణము; ప్రకృతి పరమాత్మల సమైక్యము అంతరమైన పరమార్ధముగా రూపొందిన కధ. 1898 కి పూర్వపు రచన. మిక్కిలి వాసికెక్కిన కృతి.

12. సావిత్రీచరిత్రము: సందానార్ధము దాసుగరు మాతృశ్రీ ఆదేశానుసారము 1902 లో రచించిరి. 1903 లో పుత్రికన్ బడసి యామె కా పేరిడిరి. అనేక అన్యరాగముల విషయముల విషయమునను, కీర్తనలందు ముద్రాలంకార విషయమునను ఒక విశిష్టత గలది.

13. హరిశ్చంద్రోపాఖ్యానము: 1898 కి ముందటి రచన. 1912 లో విజయనగరమున రీవా సర్కార్ రాణి అప్పల కొండయాంబగారు దాసుగారి ఏతత్కధాగానము విన్నప్పుడు శోక వివశయై అంత కరుణరస ంరిప్లుతిగల ఆ కధ నింకెప్పుడు చెప్పవద్దని కోరిరి.

14. శ్రీహరి కధామృతము: మూడు సంస్కృత్ హరికధలు సంపుటి. (దీని గురించి "సంస్కృత కృతులు" (క్రిందచూడనగును.)

గమనిక: ఉపరికృతులలో గోవర్దనోద్దారము, ద్రువచరిత్రము ఉపలబ్దలుగావు. గౌరప్పపెండ్లి యొక్కతూరి ముద్రితము. యదార్ధరామాయణము, సావిత్రీచరిత్రము రాజమహేంద్రవరము కొండపల్లి వీరవెంకయ్య అండు సన్సు వరి చేతను, కడమవన్నియు విజయవాడ సరస్వతీ బుక్ డిపో వారిచేతను బహువారములు ముద్రితములైనవి. (దాసుగారి యితర కృతులను అనేకము వీరియొద్ద లభించును.) ఈ హరికధ లన్నిటికిని సూరిష్కృత ప్రతులు వెలయించుట మిక్కిలి అవసరము. ఒక్క మార్కండేయ చరిత్రకు మాత్రము అట్టి ప్రతి "నాట్యకళ" - 1965 ఫిబ్రవరి సంచికలోవచ్చినది.