పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/198

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

అదీ వారి 19 వ యేట (1883)లో, అవలీలగా, ఒక్కరోజులో దారణ చేసి అతి హేలగా విజయనగరమున వేంచేసియున్న గానలోలుడు వేనుగొపాలస్వామి సన్నిధానమున గానము చేసిరి. ఆ కధనే పలుతావుల గానము చేసి ఘనసన్మానము లందిరి. కాని గ్రంధ మలబ్దము.

7.ప్రహ్లాదచరిత్రము: ఒకపరి విశాఖపట్టణమున ప్రభల లక్ష్మీనరసింహంపంతులుగారి యింట దాసుగరు బసచేసియుండిరి. ఎవరో వచ్చి పంతులుగారికి "భక్తప్రహ్లాద" నాటకపు కాంప్లిమెంటరీ టికెట్టు నిచ్చినారట."ప్రహ్లాదుడే నాయింట బసచేసి యుండగా నాకెందుకీ నాటకము?" అని పంతులుగారు దానిని తిరస్కరించిరట. ఆ దాసుగారు పలు తడవలు గానము చేసి పరవశించి పోయిన కధ యిది. రచన 1893, సంగీత విషయమున ఒక వైశిష్ట్యము గలది.

8. భీష్మచరిత్రము: భావనలో ఫోతన పోకడ, రచనలో తిక్కన చిక్కనయి గల కృతి రచన 1902.

9. మార్కండేయ చరిత్ర: విజయనగరమున నొకప్పు డనావృష్టి యేర్పడి నప్పుడు ముందుగా ప్రతిజ్ఞచేసి "మూడు కొవెళ్ళు "దాసుగా రీ కధచెప్పి మూడు దిక్కులు వాన కురింపించిరట.వారి పవిత్రవాక్కున హరికధయుహరికధయై ప్రత్యక్షముగా శివంకరమై ఫలించినది. రచన 1891.

10. యధార్దరామాయణము: 1915 లో దాసుగా రొక విశిష్ట ప్రణాళికపై షట్కధా* సంపుటిగా రూపొందించిరి. అనేక ప్రక్షిప్తములతొ గూడిన నేటి వాల్మీకి రామాయణమున ఆ అతిలోక దీరోదాత్త నాయకునకు, ఆర్షకవి హృదయమునకు తగినట్లు యదార్ద కధ యెట్లుండవలెనో నిరూపించిరి. ఇది నాటినుండి నేటిదనుక యావదాంద్రమునకు అనేక హరిదాసులకు మాన గ్రానమై ఉపాధి కల్పించుచు, జనానీకమున భక్తి సద్భావ సంపదను, కళారాసిక్యమును పెంపొందించుచున్నది.

  • శ్రీరామ జననము, సీతాకళ్యాణము, పాదుకా పట్టాభిషేకము, రామ సుగ్రీవమైత్రి, హనుమత్సందేశము, సామ్రాజ్యసిద్ది.