పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/190

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

మానవుడు

   ఒరుల గొన్పం జూచి యోర్వలేకుంట
   అకసంబున మిద్దె లల్లుకొంచుంట
    తప్పని ముప్పుకై తలడిల్లుచుంట
    ఉన్నదాన న్దవ్వి పొందకయుంట
    అరమరతోడుత నల్లాడుచుంట
    ఎల్లవారలకు కీడే యెంచుచుంట
    కయ్యమునకు ముందు కాల్దువ్వుచుంట
    తెలిసినట్లెల్లయు న్దగ నీల్గుచుంట
    ఎల్లరికన్న దా నెక్కువన్కొంట
    తన మేటి నేర మెంతయు గొంచెమనుట
    బరుల తప్పొక్కింతయు న్పైచకుంట
    తన సుకమునకునై తంటాలుపడుట
    పుట్టుతెవిళ్ళినెప్పుడు మావినులకు.

--వేల్పుమాట


మోహము

  అక్కటా మోహ మనితి కక్కజంబు
  తేల్విదివ్వె చూపి తెలిపిన గానరు
  మోహతిమిరమందు మునుగువారు.

--సారంగధర


విదగ్దులు

   చూచునంతలోన జుట్టరికము జూపు
   వాని నెఱుగు నేరుపైన వాడు॥
   దారి కడ్డమైన దానిని నేర్పరి
   మిగుల దొలగద్రోసి పొగడబడును ॥
   నేర్పు గలుగువాడు నెఱవేఱు నందాక
   బనికి జొచ్చి కోర్కి బడయుచుండు॥