పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొణీకిస లాడుచుండును. ఆపద్యము లా పదము లా కూర్పు లా యూహలు ప్లాస్కునుండి కప్పులోపోసిన కాఫీ ద్రవనవోష్ణతవలె నద్య: స్వాద్యముగా నుండును. సహజకవి. "బ్రతుకున సుంకం బెఱుగక - స్వతంత్ర రాజ్యంలు సేయ ప్రభువు వలె"....పతివ్రత వలె, సత్యవ్రతి వలె నిత్యసంతోషియని యొకచో వాక్రుచ్చిరి (పుట.59) అంత సహజకవిత్వశాలి కనుకనే ఆయన అంత సర్వతంత్ర స్వతంత్రుడాయెను.

          "ఎందుకో పెద్దలు వడిక ట్లేర్పఱిచిరి
            యాట పాటల గొల్వున కనునగువటు
            తెల్లముగ నున్న నలిగిన తెన్ను మాని
            త్రొక్కు బెడత్రోవ నా వంటి నిక్కు బొతు" (పుట48)

అది పెద్దలు నడిచిన క్షుఱ్ఱ మార్గమైనను తన కంత పడదని గడుసుగా సూచించిరి. "మురారే న్తృతీయ: పంధా:" అన్నట్టిదిది. అయితే మురారి గురుకుల క్లిష్ఠుడు కవితా జీవాతువులైన కావ్య హెతువులలో ప్రతిన గరీయసి. అది కవితకు ప్రాణసారము. ప్రతిభా సహకృతమైన సృష్టి నిత్య ప్రత్యగ్రము. ఎప్పటికప్పుడేదో యొక నవ్యసినృక్ష తత్స్వభావ జీవలక్షణము. అందుచే దాసుగారివెలె ప్రతిభా సమగ్రుడైన కవి పూర్వకవి ప్రౌఢ మార్గములుఇ తన కెంత నచ్చియున్నను తన పుంత తా నేర్పరుచు కొనును. జీవితమున మహాజన మార్గానుసరణ మవశ్య ముసాదేయమే గాని సహిత్యమున ప్రతికవియు ఎవరి వారి వారు చూచుకొనుటమె మంచిది. ప్రతిభావంతులైన ప్రాచీన్ మహాకవు లందదు చేసినపని యదియే. లెకున్న కవిజగత్తున వారికొక వ్యక్తిత్వమే లేదు. విశిస్ట ప్రసత్కి యుండరు. దాసుగాగి యూహ యదే.

  ప్రాచీనకవి ప్రతిపత్తి:
  అయితే తృణీకృత బ్రహ్మపురందరుడైన ఆయన దుర్విదగ్దులగు ప్రతిస్పర్ధులకొక పెడవరపు కొర్రువలె గన్పింతురు గాని హద్దుమీరిన యహంకారము గదు వారిది. ప్రాచీనుల మీదను పెద్దల మీదను గౌరవములెని గర్విష్ఠులుకారు. తన "జగజ్యోతి" కి  తాను వ్రాసికొన్న పద్య పీఠికలో--

          "కావ్య రచనకు వాల్మీకి కావలయును
            తగును వ్యాసు డొకండె శాస్త్రంబు దెలుప