పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/178

ఈ పుటను అచ్చుదిద్దలేదు
:10

దా స భా ర తి

పొలములం దోటలుం, జేతి పుస్తకమ్ము,
నిన్ను వాడెడు వీణియ నీలకంఠ!
అనవరతమును నా కుంచి కనికరించి
కాలపాశంబు విడిపించి కావుమయ్య।

--మార్కండేయ చరిత్ర

20. దర్శనము:

కవిరి బాలాతన విబాంశుకము, ప్రబుద్ద
నరనిజాక్షము, చంద్రికా దరహసితమ్,
నవ్యప్రారంబ సుఖదర్శనంబు నైన
శారదదినంబు వలెనున్న్ నారసింహ.

21. నైజము

సీ॥ ఎండమావుల నీతినుండి యెట్టుల జల్వ
         తెమ్మెర యేతెంచి తీర్పు డప్పి।
     కుందే లెదిరి తన కొనవాడి కొమ్ముల
         గ్రుచ్చి పులి న్నేల గూల్చుటెట్లు।
     పుట్టుగొడ్రాలి ఱొమ్ముల చేపునకు వచ్చి
         పసిబిడ్డ యాకలిం బావుటెట్లు।
     మఱ్ఱివిత్తు న్నాట మఱి దానివలన నె
          ప్పుడయిన మామిడి మొలచుటెట్లు।

    గాడినిప్పున దామర కలుగుటెట్టు।
    లెండమా వుండుటెట్లు లెద్దీనుటెట్లు।
    ముసలివారికి పిల్లలు పుట్టుటెట్లు।
    లాఱునూఱైన సాజంబు మాఱుటెట్లు।