పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/177

ఈ పుటను అచ్చుదిద్దలేదు

18

క చ్చ పీ శ్రు తు లు

17. గౌతమి:

ఉ॥ అంతట బాలు డీశ్వర పదబ్జము లెంచుచు హాయి నేగి య
     త్యంతముదంబున న్గనియ నాతత పర్వత గహ్వరాంతరా
     క్రాంత మహాశ్మసంచయ్ విఘర్షణ భీషణ వప్రవాహ నం
     క్రాంత వితాంతమీన మనరప్రణభీకర గౌరమీనదిన్.

18. యమదూతలు :

ఉ॥ హుమ్మనువారు, భూరి అరిఘోన్నత్ర బాహుల నప్పళించి రా
      రమ్మనువారు, భీకర పరశ్వధము ల్పనరించి చెంగటన్
      గ్రుమ్మరువారు, విప్పులటు గ్రుడ్దులు ద్రిప్పెడువారు గాని దై
      ర్యమ్మున నావి బట్టుకొన రా డొకడైన నదేమి చోద్యమో!

19, స్బుద్గ మనోరధము* :

సి॥ నమగని గర్వించు నా యమ్మ లాలింత,
        సంతుష్టి బొందిన జనకు ముద్దు,
     పెన్నిధివలె నన్ను గన్నార జూచిన
        యగ్రజన్ముల పొంగు, నాడు తోడు,
    జాలితో జూచిన జట్టుదారులు, ముద
       మందిన కోవిదు, లలరు కులము,
   ముఱ్ఱుపా ల్పేవుచు మొదవు నాకెడు లేగ
       మేటి చద్వుకొల్వు, మిద్దేటిల్లు,

[*అది అసలు దాసుగారి కోరికయే, వారి సర్వ సారస్వతము నిట్లు స్వానుభవ మహిత మైనదే. ఆత్మీయతాశ్రుతి సుభగమైనదే.]