పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లకులాయము కాయము, ఒకంష్టివాని ముదనష్ఠపు మొగము కూద రసజ్ఞజనమనోజ్ఞ ములే యగును. అలౌకిక లక్షణమైన రసానుభవ రహస్య మదే. హృద్యమైన యనుభూతి యనగాఉషస్సుషమానుభగమైన యొక శుభ సమయమున ఉపరితల మరుజాడులు కుండలిత శిలామండలమై, శిఖరాంచలము పద్యోభ్యుదిత బాలభాన్ రోచిర్వీచీ సంజ్జ్వలమై, హమనిర్ఘ రోప క్రమ రమణీయమై కంపట్టు కాంచనగంగాశైల శృంగమును చూచినంత కలుగు సురుచిరాంభూతి కాదు. ఆ మహిమలయమైన హిమాలయ దృశ్యమున కళాంక శేఖరుని జటా విటంకము స్ఫురించవలె. ప్రియ వల్లభయొక్క సల్లలిత సంగీతము విన్నప్పుడు కేదు తదుపరి తదాయల్లక భరమున మన్నప్పుడు మన:కర్ణ కుహరమౌన ఆ మధురస్మృతి మారెలుగిచ్చునప్పు డదీ యనుభూతి. వరుసపెట్టి జిలేబీల నొక యద్ధసేరు ఆరగించినప్పుడు కాదు అపూప విఫణిలో అద్దముల ముందు అందమైన పళ్లరమునందు తీరుగా పేర్చబడిన పలుపేటల కెంపుల డవురుగళ్లీల వలె నున్న వానిని నోరూర కన్నార గాంచినప్పుడదీ గుండియ గుత్తగొన్న యనుభూతి. ఆయా వస్త్వంద్రియ సన్నికర్షము వలన అప్పటి కప్పు డేదో యొక లౌకికవాసనా వావితమైన అనుభూతి ప్రతి పశువు క్రిమి కీటకము గూద పొందును. అనుభోక్త మానవుడే కానక్కర ;ఏది/ సర్వ జ్ఞానేంద్రియము లకును సాక్షిభూత మైనది మనస్సు. ఆ మనశ్శక్తి పండిన అదృష్టవంతుడు మానవుడు. అస్మత: ప్రాప్త సంషారముతో, స్వయం కృషి ప్రలబ్ద పరిణతితో, ఆలోచనాశీలమైన మనస్సుతో, నైక బావ వ్యక్తీకరణ శక్తివంతమైన వాక్కుతో పశుప్రపంచము నుండి తన వార్ధక్యమును సార్ధకముగ నిరూపించ్కొని ఏ విషయము నైన ఆత్మసాక్షికముగ అనుభవించ గలవాడు ఆవిష్కతించ గలవాడు మానవుడు. అందుచే అతడు పొందు అనుభూతి మందలో నొకడు పొందినట్లుండ వల. కేవల రుచిజీవి పశువు. అభిరుచి జీవి మానవుడు. దాసుగారి కవితాశములు:

   పూర్వోక్త నిర్వచన పరమార్ధమ్నకు లక్ష్య భూతమైన కవితాపదార్దము కావలసినంత గులదు దాసుగారి కృతులలో, ముందు కవి యన్నను కవిత్వమన్నను ఆయనకున్న ఆశయము లెట్టివోపరిశీలింతము:

        "కవి స్పాక్షాత్త్రయా మూర్తి: కావ్య మేతచ్చరాచరం
        న కశృ ద్వస్తుతో భేద: కార్యకారణయో స్తయో:"