పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కతివయముల నొక శతపుట పరిమిత సంపుటమునకు మాత్రము సరిపడు నట్లెన్నిక చేసి ప్రతిపాదిక విషయస్వభావమును బట్టి న్యపదేశ మొనర్చితిని. దాసుగారి కృతులనిండ భక్తిమబంధురోక్తులు, సూక్తులు కోకొల్లలు, వానిని త్వరలో "భక్తి సుధ", "సూక్తి సుధ" అను పేరున ప్రత్యేక కృతులుగ దాసభారతి ప్రచురణముగ నెలయించు సంకల్పముతో వాని నెక్కువగ నిందు గ్రహింపలేదు. అయితే గ్రంధాంతర్మున దాసుగరి దౌహిత్రులు కీ.శే. ఉపద్యాయుల సూర్యనారాయణగారు సేకరించిన సూక్తులందు కొన్నిటి నొక అనుబంధముగ చేర్చితిని. మరియొక అనుబంధ్మున జిజ్ఞాసువుల కోసము దాసుగారి జీవితమందలి ముఖ్య సన్నివేశములను వారి జీవిత చరిత్రలను, స్వీయ చరిత్రను, నాటి వార్తాపత్రికలను ఆధారము చేసికొని కాలక్రమనునృతమైన యొక పట్టికగా రూపొందించితిమి. మూడవ యనుబంధమున నారాయణదాస గ్రంధావళి గురించి అవసరమైన నింగడింపుల క్రింద ఆ యా గ్రంధముల స్వరూప స్వభావముల గురించిన స్థూల నిర్డేశము, ముద్రణ ప్రచురణాధికము గురించిన్ వివరములును గలవు. ముందు విషయసూచికలో గ్రంధస్థ సర్వ విషయములు యధోదాహృత క్రమముగ చూపబడి నప్పటికి చివర నాల్గవ యనుబంధమున పాఠకుల్ సద్యశీలన సౌకర్యార్ధము అకారాది విషయానుక్రమణిక చేర్చబడినది. ఆయా విషయముల గురించిన అకరములు గ్రంధ శరీరమునందే తత్రతత్రోచితముగా ఉదాహరింప బడినవి. గ్రంధ శరీరగతములు కావలసిన మరికొన్ని యంశములు ప్రరస్తాత్పరికల్పితములు అనుబంధములకు ముందే "పరిశిష్ట" శీర్షిక క్రింద సమీకృతములు, ఇదీ గ్రంధము యొక్క స్వరూపము.

కవిత్వ పరమార్థము:
     ఇక కవితానుశీలన మించుక, శ్రావ్యమైన శబ్దముద్వారా రమ్యమైన అర్ధమును హృద్వీమైన అనుభూతిగా పరిణమింప జేయునది కవిత్వమని నేనెరిగిన సర్వనిర్వచనముల సారాంశము శ్రావ్యమైన శబ్దము లనగా అనురూప శబ్దజాల పున:పునరావృత్తి యనికాదు. లేక కొందరనుకొనునట్లు ఉచ్చారణ సులభములై తదర్ధశక్తి సందీపకములై ఝటితి స్పుతణకరణ వటువులై వీనులున్న మది కించునట్టివి. రమ్యమైన అర్ధమనగా రాకేందు రేఖకాదు. రాజీవ రాజికాదు, రజనీ ప్రియల్నఖము రమణీ మణి ముఖము కాదు - కవి కనీవికాపునీత మైన యొక నిష్ఠుర కుష్ఠరోగి కృమికుల సంకు