పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/121

ఈ పుటను అచ్చుదిద్దలేదు

65

క చ్చ పీ శ్రు తు లు

73 టెన్నిసుక్రీడ :

సీ॥ ధర్మార్ధ మెగచు మత్స్యముల లంకించు గ్ర
         ర్బలగతి బంతికోలలు చలింప
     అస్వతంత్రపు బ్రతుకట్టు లట్టిటు తూల
        గొట్టబడిన చెండ్లు మిట్టిపడగ
     రాణివాసపు తెఱలా గంటరాక మ
        ధ్యస్థమౌ జూలు మర్యాద నిలుప
    యజ్ఞవాటము వలె స్వచ్చమై నున్నవి
        హద్దుల నాటవ ట్టలరుచుండ

      భటులు మగ్గపుకండెల నగిది తెరుగ
      ఓటమి న్గెల్పు లెక్కించు మాట చెలగ
      అలకనారాయణ గజేంద్రు డతలఘవుగ
      వేడుకలుమెర గండకక్రీడ సల్పె

74. తిరువళ్ళూరు రాజాయి పాట:

గీ॥ జిలుగు రతనాలపేట, పూచెండులాట
     క్రొంజవుల యాట, అమృతంబు కొలను మోట,
     వలపు ముద్దుల మూట, పువ్విల్తువేట.
     హాయి నొడపోయ తేట రాజాయి పాట.

75. పప్పు వెంకన్నగారి పాట:

    ఒకసారి పావుర మెదిగి వచ్చిన యట్లు
           వానకోయిల పిట్ట పలికినట్లు