పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/94

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 97

5.కొమ్మి రంగయ్యసూరి: ఈతఁడు సూరిగారికి సాక్షాత్ శిష్యుఁడు. సూరివలెనే చాత్తాద వైష్ణవకులమునకు చెందినవాఁడు. ఆతనివలెనే నీతిసంగ్రహ మను నొక చిన్ని గ్రంథమును రచించి ప్రకటించియున్నాఁడు. ఇదియును ముద్రితమై సూరి నీతిసంగ్రహమువలె పాఠశాలలకు మిగుల నుపయుక్తమై యున్నది.

6. తంజనగరము రంగమన్నారయ్య: ఈతఁడు ప్రసిద్ధుఁడగు దేవరాయసుధి తండ్రి. కొన్ని సంస్కృతాంధ్ర గ్రంథములను రచించి ప్రాచీన గ్రంథములకు వ్యాఖ్యానముల నీతఁడు వ్రాసెను. ఈతని వచనశైలియు మనోహరముగ నుండును.

సూరి సమకాలికులలో నాతని కనేకవిధముల సహాయ మొనర్చినవారు. మహాప్రసిద్ధులైనవారు నలుగురు గలరు. వారిలో కలువలపల్లి రంగనాథశాస్త్రిగారును, గాజుల లక్ష్మీనరసింహముశ్రేష్ఠి (1806 - 1868) ముఖ్యులు. ఇంక మిగిలిన వారిద్దఱు పాశ్చాత్యులు. ఒకరు ఆర్బత్ నాటుదొరగారు; రెండవవారు బ్రౌనుదొరవారు. వీరిలో మొదటివా రాకాలమున విద్యాశాఖావిచారణాధికారి (Director of Public Instruction) గా నుండిరి. సూరి తన నీతిచంద్రిక నీదొరవారి కంకిత మొనర్చియున్నాఁడు. ఈదొరగారు సూరిని సువర్ణ హస్తకంకణ మొసఁగి యెట్లు సత్కరించినదియు నింతకు క్రితమే వివరించి యున్నాను. ఇంక బ్రౌనుదొరవా రాకాలమున ఆంధ్రభాషా