పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/71

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 74

8. క్రియాపరిచ్ఛేదము. ఇందు తెనుఁగు సంస్కృతధాతువుల నుండి యేర్పడిన క్రియలయొక్క రూపనిష్పత్తి యంతయును వివరింపఁ బడినది. సూత్రములు 124
9. కృదంతపరిచ్ఛేదము. ఇందు క్రియలమీఁద నేర్పడిన విశేష్యములు తెలుపఁబడినవి. సూత్రములు 22
10. ప్రకీర్ణకపరిచ్ఛేదము. ఇందు పూర్వపరిచ్ఛేదములలో వదలి పెట్టఁబడిన విషయములు వివరింపఁ బడినవి. సూత్రములు 25
10 పరిచ్ఛేదములు. సూత్రములు 465

భాషాసంప్రదాయముల నామూలాగ్రముగా పథించి యంతకుముందు లేని సంస్కృతవ్యాకరణపద్దతిని నాలుగువందలయఱువదియైదు సూత్రములతో ప్రామాణికమగు ప్రశస్త వ్యాకరణము పది పరిచ్ఛేదములలో రచించిన చిన్నయసూరి ప్రతిభ యనన్యసామాన్యమైనది కదా! ఈ వ్యాకరణవిశిష్టత నిట్లు నిరూపింపవచ్చును.

1. సూత్రములు సంగ్రహముగ నుండుటవలన కంఠస్థముచేయుట కనుకూలమైయున్నవి.

2. వ్యర్థపదములు లేకుండుటచే వ్యాకరణవిషయము సరిగా గ్రహించుట కనువుగా నున్నది.

3. ఈ వ్యాకరణపఠనవలన సంస్కృతభాషావ్యాకరణ పరిపాటి గ్రహించుటకు వీలు గలిగియున్నది.